Nagarjuna: మాస్ డైరెక్టర్ కి నాగ్ ఛాన్స్ ఇస్తున్నాడా..?

సీనియర్ హీరో నాగార్జున ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. దీని తరువాత నాగార్జున ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో దర్శకుడు సంపత్ నంది పేరు వినిపిస్తోంది. ఇటీవల సంపత్ నంది చెప్పిన ఒక లైన్ నచ్చడంతో దాని ఫుల్ వెర్షన్ చూశాక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. నాగార్జునకి మాస్ లో ఉన్న ఇమేజ్ గురించి తెలిసిందే. ‘బంగార్రాజు’ సినిమా సమయంలో మాస్ లో తన ఫాలోయింగ్ గమనించిన నాగార్జున..

దాన్ని మరింత బలోపేతం చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సంపత్ నందికి ఎంత మాస్ పల్స్ మీద పట్టున్నా.. కూడా ‘రచ్చ’ తరువాత ఆ స్థాయిలో హిట్టు కొట్టలేకపోయారు. ‘బెంగాల్ టైగర్’ యావరేజ్ గా నిలవగా.. ‘గౌతమ్ నందా’ ఫ్లాప్ అయింది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే. తనకు ‘గౌతమ్ నందా’తో ఫ్లాప్ ఇచ్చినప్పటికీ.. గోపీచంద్ మరో ఛాన్స్ ఇచ్చారు. దీంతో సంపత్ నంది మరో మాస్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ‘సీటీమార్’ అనే సినిమా తీశారు.

ఈ సినిమా కూడా అంతంతమాత్రంగానే ఆడింది. దీంతో రామ్ చరణ్ తో ప్లాన్ చేసుకున్న ఓ సినిమా పూర్తిగా పక్కకెళ్లిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సంపత్ నంది కథలు అందించి నిర్మాణ భాగస్వామ్యం వహించిన ‘బ్లాక్ రోజ్’, ‘ఓదెల రైల్వేస్టేషన్’ నిర్మాణంలో ఉన్నాయి.

ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే.. ‘వైల్డ్ డాగ్’, ‘మన్మథుడు2’ లాంటి సినిమాలతో డిజాస్టర్లు అందుకున్నారు. సంక్రాంతి సీజన వలన ‘బంగార్రాజు’ సినిమా కాస్త బెటర్ గా ఆడింది. ఆ సమయంలో పెద్ద సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చింది. మరి ప్రవీణ్ సత్తారుతో చేస్తోన్న ‘ది ఘోస్ట్’ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus