Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నేను అఖిల్‌ని ఎలా చూడాలనుకున్నానో అలా ‘హలో’లో చూశాను : నాగార్జున

నేను అఖిల్‌ని ఎలా చూడాలనుకున్నానో అలా ‘హలో’లో చూశాను : నాగార్జున

  • December 7, 2017 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను అఖిల్‌ని ఎలా చూడాలనుకున్నానో అలా ‘హలో’లో చూశాను : నాగార్జున

యూత్‌ కింగ్‌ అఖిల్‌ హీరోగా కళ్యాణి ప్రియదర్శిన్‌ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌ అండ్‌ మనం ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రం ‘హలో’. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. హైయస్ట్‌ బడ్జెట్‌తో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతున్న ‘హలో’ చిత్రం డిసెంబర్‌ 22న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక స్క్రీన్‌లలో రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా ‘హలో’ చిత్ర విశేషాలను తెలపడానికి డిసెంబర్‌ 6న హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు.

నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ”హలో’ చిత్రాన్ని డిసెంబర్‌ 22న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. టీజర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో మాలో ఒక ఉత్సాహం ఊపు, వచ్చింది. యు-ట్యూబ్‌లో, డిజిటల్‌ మీడియాలో ట్రైలర్‌కి రిలీజ్‌ అయిన మూడు నాలుగు రోజుల్లోనే హయ్యస్ట్‌ వ్యూస్‌ వచ్చాయి. 8 మిలియన్స్‌ దాకా టచ్‌ అవుతోంది. సినిమా పై ఎక్స్‌పెక్టేషన్స్‌ హైలో వున్నాయి. డెఫినెట్‌గా అందరి అంచనాలకు రీచ్‌ అవుతుంది. సినిమా చూసి చాలా చాలా హ్యాపీగా వున్నాం”.

10న వైజాగ్‌ ఎం.జి.ఎం. గ్రౌండ్‌లో ఆడియో!!
ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ వండ్రఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. అలాగే రీ-రికార్డింగ్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఇచ్చాడు. డిసెంబర్‌ 10న వైజాగ్‌ ఎం.జి.ఎం. గ్రౌండ్‌లో ప్రేక్షకుల, అభిమానుల సమక్షంలో ‘హలో’ ఆడియోను చాలా పెద్ద స్కేల్‌లో చేయబోతున్నాం. దాదాపు రెండు గంటల పాటు సాగే ఈ ఫంక్షన్‌లో అఖిల్‌ లైవ్‌ షోలో ఒక పాట పాడి డ్యాన్స్‌ చేయబోతున్నాడు. ఆరు గంటలకి స్టార్ట్‌ అయ్యే ఈ ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా మంచి విజువల్స్‌తో ప్లాన్‌ చేశాం. అందరూ వచ్చి ఫంక్షన్‌ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను”.

‘హలో’ని చాలా రెస్పాన్స్‌బులిటీగా తీసుకున్నాం!!
చాలా కాంప్లికేటెడ్‌ కథతో ‘మనం’ చిత్రాన్ని చాలా సింపుల్‌గా తీశాడు విక్రమ్‌. ఫెంటాస్టిక్‌ డైరెక్టర్‌. ‘హలో’ కథ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్‌ ఫీలయ్యాం. 8,9 నెలలు స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేశాం. పక్కా బౌండ్‌ స్క్రిప్ట్‌ రెడీ అయ్యాక షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ యాక్షన్‌ స్టోరి ఇది. విక్రమ్‌ సినిమాల్లో వుండే మ్యాజిక్‌ ‘హలో’లో కూడా వుంటుంది. అఖిల్‌ లాస్ట్‌ టు ఇయర్స్‌ నుండి మంచి సినిమా చెయ్యాలి అని వెయిట్‌ చేస్తున్నాడు. తను ఎంత కష్టపడ్డాడో సినిమా చూస్తే తెలుస్తుంది. నాతో, అమలతో ప్రియదర్శన్‌ ‘నిర్ణయం’ సినిమా చేశారు. వారి అమ్మాయి కళ్యాణి ప్రియదర్శన్‌ అఖిల్‌తో హీరోయిన్‌గా నటిస్తోంది. చిన్న కో ఇన్సిడెన్స్‌ ఏంటంటే కళ్యాణి మదర్‌ లిజి నాతో తెలుగులో ఇంట్రడ్యూస్‌ అవ్వాలి. కుదరలేదు. వారి అమ్మాయి ఈ చిత్రంతో అఖిల్‌ ప్రక్కన పరిచయం అవడం చాలా హ్యాపీగా వుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, అఖిల్‌ మదర్‌ అండ్‌ ఫాదర్‌ క్యారెక్టర్స్‌లో నటించారు. బ్యూటిఫుల్‌ ఫ్యామిలీ రొమాంటిక్‌ ఫిల్మ్‌ ఇది. యాక్షన్‌ మిక్స్‌ అయి వుంటుంది. రెగ్యులర్‌ యాక్షన్‌ కాకుండా కొత్త తరహా యాక్షన్‌ వుంటుంది. ఈ సినిమాకి హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ బాంబ్‌ బ్రౌన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ని కంపోజ్‌ చేశాడు. చాలా రియలిస్టిక్‌గా యాక్షన్‌ వుంటుంది. ముప్ఫై రోజుల పాటు యాక్షన్‌ సీన్స్‌ని చిత్రీకరించాం. ఫస్ట్‌ టైమ్‌ హైదరాబాద్‌ మెట్రో, కృష్ణానగర్‌ రోప్‌ టాప్స్‌ పైన యాక్షన్‌ని చిత్రీకరించాం. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అంతా చాలా థ్రిల్లింగ్‌గా వుంటాయి. ఇంతకుముందు తెలుగు స్క్రీన్‌ మీద చూడనివిధంగా వుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు బాగా నచ్చుతుంది. జాకీచాన్‌ యాక్షన్‌ గుర్తుకు వస్తుంది. ‘మనం’ వర్క్‌ చేసిన పి.ఎస్‌.వినోద్‌ ఈ సినిమాకి అద్భుతమైన గ్రాండ్‌ విజువల్స్‌ని అందించారు. స్క్రీన్‌ప్లే చాలా సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా వుంటుంది.

అదే మాకు ఆస్కార్‌ అవార్డుతో సమానం!!
జనరల్‌గా ఎప్పుడూ మేము కొత్తగా పబ్లిసిటీ చేస్తుంటాం. ‘హలో’ చిత్రంలోని ఒన్‌ మినిట్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశాం. దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆడియోకి 1 మినిట్‌లో 4 సాంగ్స్‌ రిలీజ్‌ చేయబోతున్నాం. డిసెంబర్‌ 18, 19 కానీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని హైదరాబాద్‌లో ప్లాన్‌ చేస్తున్నాం. అఖిల్‌ యు.ఎస్‌.లో ప్రమోషన్స్‌లో వున్నాడు. రాగానే గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేస్తాం. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాన్ని సంక్రాంతికి జనవరి 10న వస్తున్నాం అని ఎనౌన్స్‌ చేశాం. అలాగే ‘హలో’ చిత్రానికి కూడా డిసెంబర్‌ 22న వస్తున్నాం అని సెప్టెంబర్‌లోనే ఎనౌన్స్‌ చేశాం. ఎన్ని సినిమాలు రిలీజ్‌ అయినా పెద్దగా ప్రాబ్లెమ్‌ వుండదు. మనకి చాలా థియేటర్స్‌ వున్నాయి. సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. అయినా పెద్దగా కాంపిటీషన్‌ ఏమీ వుండదు. ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాను తప్ప నటించలేదు. సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. పర్సనల్‌గా నేను చాలా హ్యాపీగా వున్నాను. ‘మనం’ ఎంటర్‌ప్రైజెస్‌తో నేను, చైతు, అఖిల్‌ ముగ్గురం సినిమాలు చేస్తాం. అందుకే సెంటిమెంట్‌ ప్రకారంగా ‘మనం’ అనేది ఎప్పుడు వుండాలని ఆ బేనర్‌ పెట్టాం. ఈ సినిమాకి ఏది అవసరమో అంతే ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్‌పై కన్పిస్తుంది. ఈ సినిమా హైలైట్స్‌ విషయానికొస్తే.. కొత్త రకమైన యాక్షన్‌, మదర్‌ అండ్‌ ఫాదర్‌ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఒక సోల్‌మేట్‌ కోసం 15 ఏళ్లుగా ఒక ‘హలో’ కోసం ఎదురు చూసే అబ్బాయి ఎలా పరితపించాడు. ఇవన్నీ సినిమాలో హైలైట్స్‌గా నిలిచే పాయింట్స్‌. ‘హలో’ చూడగానే నాకు ‘యాదోంకి బారాత్‌’ గుర్తుకొచ్చింది. ఇదొక ఒక రోజులో జరిగే కథ. మార్నింగ్‌ ఏడున్నర నుండి ఈవెనింగ్‌ 5.30 లోపు ఈ కథ జరుగుతుంది. నేను అఖిల్‌ని ఎలా చూడాలనుకున్నానో అలా ‘హలో’లో చూశాను. నా వరకు అఖిల్‌కి ఇంట్రడక్షన్‌ సినిమా ఇదే.

‘మనం’ నాన్నగారి చివరి చిత్రం. ఆ చిత్రాన్ని ఎంతో ప్రేమతో ప్రేక్షకులు గుండెల్లో దాచుకున్నారు. అదే మాకు ఆస్కార్‌ అవార్డుతో సమానం. నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. నేను, రామ్‌గోపాల్‌ వర్మ చేసే చిత్రం ఒక షెడ్యూల్‌ ఫినిష్‌ అయ్యింది. సినిమా బాగా వస్తోంది. నెక్స్‌ట్‌ షెడ్యూల్‌ జనవరిలో స్టార్ట్‌ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Hello Movie
  • #Kalyani Priyadarshan
  • #nagarjuna
  • #Vikram K Kumar

Also Read

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

related news

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

trending news

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

13 hours ago
Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

13 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

14 hours ago
Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

16 hours ago
Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

20 hours ago

latest news

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

2 days ago
Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

2 days ago
Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

2 days ago
Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

2 days ago
Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version