Nagarjuna: చైతన్య, సమంత ల గురించి నేను అలా అనలేదు..!

‘చైసామ్’ విడాకుల మేటర్ ను అభిమానులు ఇప్పట్లో వదిలేలా లేరు. వారి విడాకుల వ్యవహారాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఇవి అబద్దం అయితే బాగుణ్ణు అని చైసామ్ వాళ్ళు కోరుకున్నప్పటికీ వాళ్ళకి షాక్ తప్పలేదు..! అక్టోబర్ 2న అధికారికంగా వాళ్ళు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించినప్పటి నుండీ అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి. మొదట్లో సమంత కాస్ట్యూమ్ డిజైనర్ ను వాళ్ళు ట్రోల్ చేశారు. తర్వాత చైతన్య ఫ్యాన్స్… సమంతని నాన్ స్టాప్ గా కొన్నాళ్ళు ట్రోల్ చేసారు. సమంతకి మద్దతు పలికేవాళ్లు చైతన్య పై విరుచుకుపడ్డారు.

ఇది పక్కన పెడితే..వీరి విడాకుల పై నాగ చైతన్య తండ్రి నాగార్జున ఈ విషయం పై స్పందించినట్టు నిన్నటి నుండీ తెగ వార్తలు వస్తున్నాయి. సమంతే మొదట విడాకులు కావాలని కోరిందని… ఆమె నిర్ణయాన్ని గౌరవించి అడ్డుచెప్పాలని చైతన్య అనుకోలేదని…. ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారని,2021 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నారని, సమంత విడాకుల నిర్ణయం ఎందుకు తీసుకుంది? అందుకు కారణాలు ఏంటి? అన్నది నాకు తెలీదని.

విడాకుల విషయంలో పరువు, మర్యాద ల గురించే చైతన్య ఎక్కువగా ఆలోచించాడని.’ నాగార్జున చెప్పుకొచ్చినట్టు కథనాలు వినిపించాయి.అయితే ఇది ఫేక్ న్యూస్ అని.. నాగ చైతన్య, సమంతల గురించి నేను ఎక్కడా అలా మాట్లాడలేదని, దయచేసి అలాంటి అసత్యప్రచారం చేయొద్దని’ నాగార్జున తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. మొన్నటికి మొన్న చైతన్య కూడా.. ఈ విషయం పై స్పందించి సమంత, నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాము. ఇద్దరూ ఆనందంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus