Nagarjuna, Samantha: సమంత ప్రాణాంతక వ్యాధి పై నాగార్జున అందుకే స్పందించలేదా?

సమంత కొన్నినెలలుగా మాయోసిటీస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు శనివారం నాడు సోషల్ మీడియా ద్వారా తెలియజేసి పెద్ద షాకిచ్చింది. ఈ వ్యాధి సోకిన వారికి కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, నడవలేకపోవడం,ఎక్కువగా నీరసంగా ఉండటం వంటి లక్షణాలు ఏర్పడతాయి. అయితే ఈ విషయాన్ని పూర్తిగా నయం అయిన తర్వాత అభిమానులతో చెప్పుకోవాలి అనుకున్నట్టు సమంత రాసుకొచ్చింది. కాకపోతే అందుకు ఇంకా టైం పట్టేలా ఉంది వైద్యులు తెలపడంతో సమంత ఇలా తెలియజేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

తన లైఫ్ లో మంచి, చెడు రెండు దశలు చూశాను అని.. అయితే అవి వేగంగా గడిచిపోయినట్టు ఇది కూడా వేగంగా గడిచిపోతుంది అని భావిస్తున్నట్టు ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేసింది. సమంత పోస్టుకు ఎన్టీఆర్, చిరంజీవి, అఖిల్, రాశీ ఖన్నా వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ‘నీకు ధైర్యం ఎక్కువ.. త్వరగానే కోలుకుంటావు’ అంటూ కామెంట్లు పెట్టారు. అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ తో పాటు సుశాంత్ కూడా సమంత త్వరగా కోలుకోవాలని ఆసిస్తూ కామెంట్స్ చేశాడు.

కానీ నాగార్జున, నాగ చైతన్య మాత్రం ఈ విషయం పై స్పందించ లేదు. దీంతో సోషల్ మీడియాలో వారి పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘మాజీ కోడలైనా.. తన అమ్మలాంటిది అని చెప్పుకొచ్చిన మాజీ మామగారు నాగార్జున, సమంతతో విడిపోయినా ఎప్పుడూ ఫ్రెండ్ లా కలిసుంటాను’ అని చెప్పిన మాజీ భర్త చైతన్య.. ఇలాంటి పరిస్థితిలో ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా పెట్టలేకపోతున్నారు’ అంటూ వారిని నిందిస్తున్నారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. నాగార్జున, అమలతో కలిసి వెళ్లి సమంతని పర్సనల్ గా కలవబోతున్నారట. ఇలాంటి పరిస్థితిలో ట్వీట్ వేసి ఊరుకోకూడదు అని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ వార్తల గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus