Nagarjuna: ఆ సినిమా విషయంలో ఇన్నాళ్లూ వచ్చిన పుకార్లు నిజం కావా? కొత్త న్యూస్‌ ఇదే!

ధనుష్‌ (Dhanush) – శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) – నాగార్జున (Nagarjuna) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఓ సినిమా అని ఇన్నాళ్లూ చెప్పుకున్న ఆ సినిమా పేరు ‘కుబేరా’. శివరాత్రి పర్వదినం సందర్భంగా సినిమా టైటిల్‌ను, ధనుష్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అంతేకాదు ‘కుబేరా’ కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టిస్తున్నట్లు కూడా చెప్పారు. ఓ పేదవాడి పాత్రలో ఈ సినిమా ధనుష్‌ కనిపిస్తాడు అని ఆ పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది.

అయితే ఆ పాత్రలో ఒక షేడ్‌ మాత్రమే అని, మరో షేడ్‌ కూడా ఉంది అని అంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే సినిమాలో నాగార్జున పాత్ర గురించి ఇన్నాళ్లూ వచ్చిన వార్తలు తప్పు అని తెలుస్తున్నాయి. ‘కుబేరా’ సినిమాలో నాగార్జున ముంబయిలోని ధారావి ప్రాంతంలో ఉండే డాన్‌గా కనిపిస్తాడు అని అన్నారు ఇన్ని రోజులు. ఈ మేరకు ఓ పెద్ద సెట్‌ వేసి సన్నివేశాలు తెరకెక్కిస్తారు అని కూడా వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున డాన్‌గా కాదు, ఈడీ ఆఫీసర్‌గా కనిపిస్తారట. చాలా స్టైలిష్‌గా ఉండే ఈ పాత్ర సినిమాలో కీలక సమయంలో వస్తుంది అని అంటున్నారు. ‘కుబేరా’ను పట్టుకోవడానికి నాగ్‌ వస్తాడని టాక్‌. ముంబయిలోని ‘ధారావి’ అనే మురికివాడ దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా ఫేమ‌స్‌. ఆ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని డాన్‌లు దేశంలో గతంలో చెలరేగిపోయారు. ఇప్పుడు ‘కుబేరా’ సినిమాలో అలాంటి ఓ డాన్‌ను చూపిస్తారట.

ఆ డాన్‌ కోసం ఈడీ ఆఫీసర్‌ నాగార్జున ఓ డాన్‌గా మారి వస్తాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం నాగ్ 40 రోజులు కాల్‌షీట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నాగార్జునపై బ్యాంకాక్‌లో కీల‌క‌ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. రష్మి (Rashmika Mandanna)క ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అయితే ఆమె ధనుష్‌ సరసన నటిస్తోంది అని సమాచారం. మరి నాగార్జునకు హీరోయిన్‌ ఉంటారా? ఉంటే ఎవరు అనేది త్వరలో తేలుతుంది.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus