విక్టరీ వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో ‘నాగవల్లి’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2010 వ సంవత్సరంలో డిసెంబర్ 16న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అనుష్క కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో పూనమ్ కౌర్,శ్రద్దా దాస్, రిచా గంగోపాధ్యాయ్, కమలినీ ముఖర్జీ.. వంటి హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. 2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ కి సీక్వెల్ గా, 2010 లోనే కన్నడంలో వచ్చిన ‘ఆప్త రక్షక’ కి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది.
‘శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగా కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 13 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ‘నాగవల్లి’ సినిమా ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 6.85 cr |
సీడెడ్ | 3.00 cr |
ఉత్తరాంధ్ర | 1.75 cr |
ఈస్ట్ | 0.90 cr |
వెస్ట్ | 0.84 cr |
గుంటూరు | 1.30 cr |
కృష్ణా | 0.90 cr |
నెల్లూరు | 0.60 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 16.14 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.70 cr |
ఓవర్సీస్ | 0.60 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 17.44 cr (షేర్) |
‘నాగవల్లి’ (Nagavalli) చిత్రం రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో రూ.17.44 కోట్ల షేర్ ను రాబట్టి .. రూ.2.44 కోట్ల లాభాలతో డీసెంట్ హిట్ గా నిలిచింది. ఫ్లాప్ టాక్ తో కూడా ఇలా బ్రేక్ ఈవెన్ సాధించడం అంటే మాటలు కాదు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!