సుజయ్, చంద్రకాంత్, తనిష్క, రష్మీ, సోని ముఖ్య పాత్రల్లో రాజ శేఖర్ దర్శకత్వంలో సాయి హాసిని ప్రొడక్షన్స్ పతాకం పై నాన్చేరి దేవా శంకర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం నాకు మనసున్నది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కేక్కిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానున్న సందర్బంగా సోమవారం ఫిలిం ఛాంబర్ లో ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా పాల్గొన్న ప్రతాని రామకృష్ణ గౌడ్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సాయి వెంకట్, దర్శకుడు సిరాజ్ లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు రాజ శేఖర్ మాట్లాడుతూ .. చందమామ కథలాంటి సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం పూర్తయి చాలా రోజులు అవుతున్నా విడుదల విషయంలో పెద్ద టెన్షన్ గా మారింది. విడుదల కోసం చాలా మంది దగ్గరికి తిరిగాను కానీ ఎవరు పెద్దగా సపోర్ట్ చేయలేదు .. అలంటి సమయంలో నిర్మాత సాయి వెంకట్ గారు సినిమా గురించి తెలుసుకుని మంచి సినిమా తీసావు .. అని నాకు సపోర్ట్ అందించారు. ఈ విషయంలో ఆర్కే గౌడ్ గారు మరియు సిరాజ్ ఇచ్చిన సపోర్ట్ తో ఈ సినిమాను ఈ నెల 20న విడుదల చేస్తున్నాం. ఒక దెయ్యం మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తికర కథాంశంతో సాగే సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది అన్నారు.
ఆర్కే గౌడ్ మాట్లాడుతూ .. ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల కావడమనేది చాలా కష్టంగా మారింది. చిన్న సినిమాల మనుగడ ఉన్నప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. అందుకే త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక ఛానల్ ను చిన్న సినిమాలకోసం ఏర్పాటు చేస్తుంది. సాటిలైట్ ద్వారా చిన్న సినిమాలకు మంచి అవకాశం ఇది. ఇక ఈ సినిమా ట్రైలర్ బాగుంది తప్పకుండా మంచి విజయం సాదించాలి అన్నారు.
నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ .. దర్శకుడు రాజ శేఖర్ చేసిన ప్రయత్నం బాగుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. మంచి టెక్నీషియన్స్ పనిచేసారు. ప్రతి ఒక్కరు చిన్న సినిమాల విషయంలో సపోర్ట్ చేస్తే మంచి సినిమాలు ఎన్నో వస్తాయి. చిన్న సినిమా విడుదల అయితే చాలు అది పెద్ద హిట్ గా భావించొచ్చు అన్నారు.
చిత్ర నిర్మాత శంకర్ గౌడ్ మాట్లాడుతూ .. మా దర్శకుడు మంచి కథతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పటి వరకు ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి కానీ ఇది చాలా కొత్తగా ఉంటుంది. తప్పకుండా మా ప్రయత్నాన్ని ఆదరిస్తారన్న నమ్మకం ఉంది అన్నారు.