Namrata: నీ విధికి నువ్వే రాజు.. నమ్రత పోస్ట్ వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు సినిమాల పరంగా ఎంతో బిజీగా గడపగా నమ్రత మాత్రం తన పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఇక పిల్లల చదువు విషయంలో నమ్రత ఎంతో శ్రద్ధ వహిస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన కుమారుడు గౌతమ్ తాజాగా పదవ తరగతిని పూర్తి చేసుకున్నట్లు నమ్రత వెల్లడించారు.

ఈ క్రమంలోనే గౌతమ్ చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సీబీఎస్ఈలో పదో తరగతి పూర్తి చేశారని అతని పరీక్ష ఫలితాలు కూడా వెలువడ్డాయని నమ్రత తెలియజేశారు. ఇక గౌతమ్ పదో తరగతిలో గ్రేడ్ 10 సాధించడంతో మహేష్ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నమ్రత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా నమ్రత గౌతమ్ గురించి తెలియజేస్తూ..

గౌతమ్ పదవ తరగతి పూర్తి చేశాడు తను గ్రేడ్ 10 సాధించాడు. అన్ని సబ్జెక్టులలోను మంచి ఉత్తీర్ణత సాధించాడు. నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. నువ్వు మరొక దశలో కూడా ఇలాంటి చాలెంజ్ లను ఇలాగే ఎదుర్కోవాలి అంటూ వెల్లడించారు. నీకు మేము అండగా ఉన్నాము నువ్వు ఇంకా ఎదగాలి.. నీ విధికి నువ్వే రాజు.. ఇలాగే మమ్మల్ని గర్వపడేలా చేయాలి అంటూ నమ్రత వెల్లడించారు.

Mahesh Babu Family

ఈ విధంగా గౌతమ్ పదవ తరగతి మంచి ఉత్తీర్ణత సాధించడంతో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే గౌతమ్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే చిత్రంలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించి తన నటనతో అందరిని మెప్పించారు. ప్రస్తుతం గౌతమ్ చదువు పై పూర్తి దృష్టి పెట్టడంతో గౌతమ్ నటనకు దూరంగా ఉన్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Share.