Director: ఆ హీరో మూవీ ఛాన్స్ తో విరూపాక్ష డైరెక్టర్ దశ తిరగనుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో కార్తీక్ దండు ఒకరు. ఊహించని ట్విస్టులతో, అద్భుతమైన క్లైమాక్స్ తో విరూపాక్ష సినిమా సక్సెస్ లో కార్తీక్ దండు కీలక పాత్ర పోషించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో సహాయ సహకారాలు అందించారు. విరూపాక్ష డైరెక్టర్ తర్వాత సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించనున్నారని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం.

మైథికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా. కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ నవంబర్ నెలలో థియేటర్లలో విడుదల కానుంది. త్వరలో కళ్యాణ్ రామ్ కార్తీక్ దండు కాంబో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

అమిగోస్ సినిమా ఫ్లాపైన నేపథ్యంలో కథల ఎంపికలో కళ్యాణ్ రామ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ సినిమాల ఎంపికలో ఎన్టీఆర్ కూడా తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ పారితోషికం 7 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. బింబిసార సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

మల్లిడి వశిష్ట ఈ సినిమా నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు (Director) దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ కు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్లకు కళ్యాణ్ రామ్ ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus