హీరో నానికి ఇప్పుడొక ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. రెండు వారాల క్రితమే ఓ సినిమా ఫంక్షన్ లో.. సినిమాలను థియేటర్లలోనే చూడాలని అది మన కల్చర్ అంటూ పెద్ద స్పీచ్ ఇచ్చారు. థియేటర్లను బతికించుకోవాలని భారీ డైలాగ్స్ వేశారు. కానీ ఇప్పుడు ఆయన తన సినిమానే ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కలిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
దీనికి సంబంధించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. నాని కూడా ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయాలి. అది జనాలకు కన్విన్సింగ్ గా ఎలా చెప్పాలనే విషయంలో నాని తికమక పడుతున్నాడట. గతేడాది నాని నటించిన ‘వి’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఆ సమయంలో కరోనా కారణంగా తప్పడం లేదని.. నెక్స్ట్ సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే విడుదల చేస్తానని అభిమానులకు చెప్పాడు నాని. ఆ ప్రామిస్ ను పక్కన పెడితే.. రీసెంట్ గానే స్టేజ్ పై..
సినిమాలన్నీ థియేటర్లోనే విడుదల చేయాలని.. టికెట్ రేట్ల ఇష్యూ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆయనే మాట మార్చడం అనే విషయం నానిని బాగా ఇబ్బంది పెడుతోందట. అందుకే జనాలకు ఎలా చెప్పాలి..? ఎలా మ్యానేజ్ చేయాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నాడు నాని. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పీఆర్ టీమ్ గట్టిగా కష్టపడాలి.