టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాని నటించిన టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాల షూటింగ్ లు పూర్తి కాగా ఏపీలో థియేటర్ల టికెట్ రేట్ల విషయంలో నెలకొన్న ఆంక్షల వల్ల నాని సినిమాల రిలీజ్ డేట్లు ఇంకా ఫిక్స్ కాలేదు. జులై 30వ తేదీన టక్ జగదీష్ రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితం ప్రచారం జరగగా మేకర్స్ స్పందించి టక్ జగదీష్ జులై 30వ తేదీన రిలీజ్ కావడం లేదని ప్రకటన చేశారు.
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన నాని సినిమా అనేది మన కల్చర్ అని చెప్పుకొచ్చారు. థియేటర్లలో సినిమా చూడటం మన బ్లడ్ లోనే ఉందని నిత్యావసర ధరలు పెరుగుతున్నా ఎవరూ పట్టించుకోరని థియేటర్లపై మాత్రం ఆంక్షలు ఎందుకని నాని ప్రశ్నించారు. పబ్స్, రెస్టారెంట్లతో పోలిస్తే థియేటర్లు చాలా సేఫ్ అని అయితే థియేటర్లనే మొదట మూసివేసి లాస్ట్ లో తెరుస్తారని నాని చెప్పుకొచ్చారు.
పరిస్థితులు ఇదే విధంగా ఉంటే థియేటర్ వ్యవస్థ నాశనమవుతుందంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవస్థపై ఆధారపడి లక్షల మంది జీవనం సాగిస్తున్నారని ఆంక్షల వల్ల వాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంపై నాని పరోక్షంగా ఫైర్ అయ్యారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో నాని నటించిన టక్ జగదీష్ ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది. ఓటీటీ ఆఫర్లు వచ్చినా మేకర్స్ ఆ ఆఫర్లకు నో చెప్పినట్టు సమాచారం.