నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న హిట్ 3 (HIT 3) సినిమా మే 1న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్ ద్వారా ఈ మూవీపై భారీ బజ్ ఏర్పడింది. ఇందులో నాని పోషిస్తున్న ‘అర్జున్ సర్కార్’ పాత్ర చాలా బ్రూటల్‌గా ఉండబోతుందనే స్పష్టమైంది. ఇది కేవలం థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, ఎమోషనల్ ఇంటెన్సిటీతో కూడిన సినిమా కావడం విశేషం. ఈ నేపథ్యంలో హిట్ 3 మేకర్స్ ప్రమోషన్స్‌ను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్టుగానే వయొలెంట్ మూడ్‌తో ప్లాన్ చేశారు.
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ ప్రొమోషనల్ సెట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా షూటింగ్‌లో వాడిన ఆయుధాలు, తుపాకులు, కత్తులు, బుల్లెట్లు, పోలీస్ లాకప్, ఇంటరాగేషన్ రూమ్ వంటి అన్ని అంశాలను ఓ రియలిస్టిక్ అట్మాస్ఫియర్‌తో చూపించారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ రూపొందించిన ఈ సెటప్‌ను చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. మీడియా ఇంటర్వ్యూల కోసం ప్రత్యేకంగా వేసిన సీటింగ్ అరేంజ్‌మెంట్ కూడా ఆ థీమ్‌కు తగ్గట్టే ఉండడం విశేషం.
నాని, శైలేష్ కోలను సహా టీమ్ మొత్తం మీడియా ప్రతినిధులతో అక్కడే ఇంటరాక్ట్ కావడం, ఇంటరాక్టివ్ ప్రొమోషన్స్‌పై దృష్టి పెట్టడం ఇప్పుడు సినిమాకు అదనపు పబ్లిసిటీ కలిగిస్తోంది. ఈ వినూత్న ప్రమోషన్ల వల్ల సినిమాపై ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఇప్పటికే ట్రైలర్ చూసిన ప్రేక్షకుల్లో నాని యొక్క మాస్ షేడ్‌పై భారీ హైప్ ఏర్పడింది. ‘ఇది ఇప్పటి వరకూ నాని చేసిన సినిమాల్లోనే అత్యంత హార్డ్ హిట్టింగ్ మూవీ’ అని ట్రేడ్ అనలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ప్రమోషన్లకు ఇలా థీమ్‌తో మ్యాచింగ్ కంటెంట్ ఇవ్వడం అంటే కొత్తగా ఉంది. ఇప్పటికే హిట్ 1(HIT) ‘హిట్ 2’ (HIT 2) సినిమాలు సక్సెస్‌ఫుల్ అయ్యిన నేపథ్యంలో హిట్ 3 కూడా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మే 1న థియేటర్లలో ఈ వయొలెంట్ థ్రిల్లర్ ఆడియెన్స్‌ను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.