నాని (Nani) లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ (HIT 3) మరికొన్ని గంటల్లో అంటే మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. హిట్ సీక్వెల్స్ కి యావరేజ్ టాక్ వచ్చినా ఆడియన్స్ థియేటర్ కు వస్తారు. ఆ రకంగా చూసుకుంటే ‘హిట్’ (HIT) (హిట్ : ది ఫస్ట్ కేస్) ‘హిట్ 2’ (HIT 2) (హిట్ 2 : హిట్ ది సెకండ్ కేస్) సినిమాలు హిట్ అయ్యాయి.
కాబట్టి ‘హిట్ 3’ కి యావరేజ్ టాక్ వచ్చినా సరిపోతుంది… సేఫ్ అయిపోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి. ఓ రకంగా ఇండస్ట్రీకి ‘హిట్ 3’ రూపంలో ఓ సక్సెస్ పడటం చాలా అవసరం. ఎందుకంటే కొంత కాలంగా ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోతుంది. ‘ఐపీఎల్ మ్యాచ్..ల వల్ల జనం థియేటర్లకు రావడం తగ్గించేశారు’ అని సినిమా వాళ్ళు సాకులు చెబుతున్నారు.
అయితే నాని మాత్రం అలాంటి సాకులు చెప్పడం లేదు. కొద్దిరోజుల నుండి ‘హిట్ 3’ సినిమాని నిద్ర లేకుండా దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ వస్తున్న నాని. ఈరోజు టాలీవుడ్ విలేకర్లతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ‘జనాలు థియేటర్లకు రావడం లేదు’ అనే స్టేట్మెంట్ పై నాని స్పందించాడు. ‘జనం థియేటర్లకు రావడం లేదు అనేది తప్పు. మన సినిమా కంటెంట్ తో వాళ్లలో ఆసక్తి పుట్టించి థియేటర్లకు రప్పించడం అనేది మన పని.
ఆడియన్స్ కి సినిమా చూడాలనే క్యూరియాసిటీ మనం క్రియేట్ చేస్తే… ఆ సినిమాని థియేటర్ కి వచ్చే చూస్తాడు.’ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు నాని. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. జనాలకి థియేటర్లకు వచ్చే మూడ్ కనుక లేకపోతే ‘రీ రిలీజ్ సినిమాలకి ఎందుకు ఎగబడి వెళ్తున్నారు. ఆ సినిమాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు?’ ఇది మేకర్స్ కూడా గమనించాలి. ఊరికే జనం పై, ఐపీఎల్ మ్యాచ్..ల పై తోసేయడం కరెక్ట్ కాదు.