టాలీవుడ్ హీరోలంతా కూడా ఇప్పుడు తెలుగు మార్కెట్ ని దాటి ఇతర భాషల్లో కూడా తమ మార్కెట్ ని విస్తరించుకునే పనుల్లో పడ్డారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా అప్పీల్ సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేసి తమ మార్కెట్ ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. మహేష్ బాబు త్వరలోనే రాజమౌళితో సినిమా చేయనున్నాడు.
కాబట్టి ఆయన పాన్ ఇండియా మార్కెట్ కోసం బెంగ పడాల్సిన ఆవాసం లేదు. స్టార్ హీరోలతో పాటు కొందరు యువ హీర్స్ను కూడా ఇండియా సినిమాలు లాంచ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మిడ్ రేంజ్ హీరోలతో నెంబర్ వన్ ప్లేస్ లో దూసుకుపోతున్న నాని కూడా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెడుతున్నాడని సమాచారం. ఆయన నటిస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను వేరే భాషలలో విడుదల చేయాలని నాని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయంపై అధికార ప్రకటన లేనప్పటికీ ఆలోచన అయితే ఉందట.
సినిమా బాగా వచ్చిందనే కాన్ఫిడెన్స్ వస్తే మాత్రం అప్పుడు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోకి అనువందించాలని చూస్తున్నారు. పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా యూనివర్శల్ సబ్జెక్ట్ అని.. అన్ని భాషల వారికి నచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కోల్‍కతా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హీరో నాని ఇందులో ఒక రచయితగా సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు.