నాని, సుధీర్ బాబు లు హీరోలుగా అదితి రావ్ హైదరి, నివేదా థామస్ లు హీరోయిన్లుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘వి’. నిజానికి ఈ చిత్రాన్ని మార్చి 25 న థియేటర్లలో విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ కరోనా వైరస్ మహమ్మారి వల్ల థియేటర్లు మూతపడటంతో అది వర్కౌట్ కాలేదు. ఇప్పటికే 5 నెలలు కావస్తోంది…. ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఈ క్రమంలో ‘వి’ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు.. ఓటిటి లో విడుదల చెయ్యడానికి రెడీ అయ్యారు.
‘వి’ చిత్రానికి 40 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ క్రమంలో థియేట్రికల్ రైట్స్ 30 కోట్లకు అమ్మి… నాన్ థియేట్రికల్ రైట్స్ మరో 20 కోట్ల వరకూ రాబట్టుకోవచ్చు అని దిల్ రాజు ముందుగానే ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు ‘వి’ ని 32 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కు అమ్మేసినట్టు సమాచారం. ఇక డబ్బింగ్ మరియు శాటిలైట్ రైట్స్ కు మరో 15 కోట్లకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆ రకంగా చూసుకుంటే నిర్మాత సేఫ్ అనే చెప్పాలి.
ఒకవేళ థియేటర్లు తెరుచుకునే పరిస్ధితి వస్తే… ‘వి’ చిత్రాన్ని 10 కోట్లకు థియేట్రికల్ రిలీజ్ ఇవ్వాలని కూడా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట.ఒకవేళ థియేట్రికల్ రిలీజ్ ఇచ్చినా… అప్పటికే జనాలు అంతా ‘వి’ ని చూసేసి ఉంటారు కాబట్టి.. థియేటర్లకు వెళ్తారా అనేది డౌట్. అయితే ఓవర్సీస్ లో రిలీజ్ ఇస్తే కొంత వరకూ సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ‘వి’ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుందని సమాచారం.