తాజాగా 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఆగస్ట్ 9న(శుక్రవారం) ఢిల్లీలో ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలని పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో ‘మహానటి’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సావిత్రి జీవిత చరిత్రని అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం’ , ‘ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్’ ‘బెస్ట్ తెలుగు యాక్ట్రెస్’ వంటి కేటగిరీలలో అవార్డులు దక్కించుకుంది ఈ చిత్రం.
ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ నట విశ్వరూపం చూపించిన ‘రంగస్థలం’ చిత్రానికి కూడా అవార్డు వరించడం విశేషం. ఇప్పటి వరకూ ‘జాతీయ ఉత్తమ ఆడియోగ్రఫీ కేటగిరిలో రాజాకృష్ణన్ కు అవార్డు దక్కింది. 1985 సంవత్సరంలో గోదావరి జిల్లాల్లో నివసించే ప్రజల జీవనస్థితి ఎలా ఉండేదో.. మన లెక్కల మాస్టారు సుకుమార్ చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని మూడు గంటల పాటు కుర్చీకి కట్టిపడేసింది ఈ చిత్రం. ఇప్పటికీ ‘నాన్ బాహుబలి’ రికార్డులు ఈ చిత్రం పేరుతోనే ఉండడం విశేషం. మరి ఈ చిత్రం ఇంకా ఎన్ని అవార్డులు గెలుచుకుంటుందో చూడాలి.