Nayanthara, Vignesh Shivan: కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ పెళ్లి గురించి కొత్త విషయాలు.!

  • May 29, 2022 / 01:22 PM IST

కోలీవుడ్‌, టాలీవుడ్‌లో చాలా ఏళ్ల నుండి వినిపిస్తున్న ప్రేమకథ నయనతార – విఘ్నేష్‌ శివన్‌. ఈ ప్రేమ జంట గురించి వార్తలు రాసి రాసి మీడియాకు, చదివి చదివి ప్రేక్షకులకు బోర్‌ కొట్టేసి ఉంటుంది. అయినా వారి పెళ్లి విషయంలో కొత్త విషయాలు వచ్చినప్పుడు తెలుసుకోవాలిగా. ఒకటి కాదు, ఈ సారి రెండు విషయాలు బయటికొచ్చాయి. ఒకటి వారి పెళ్లి కార్డు కాగా, రెండోది పెళ్లి వేదిక మార్పు. వాటి సంగతేంటో చూసేయండి మరి.

అవును, నయనతార – విఘ్నేష్‌ పెళ్లి కార్డు ఇదే అంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజానిజాలు ఎంత అనేది తెలియదు కానీ.. కార్డు అయితే అదిరిపోయింది అని చెప్పాలి. ఇక తిరుమల సన్నిధిలో వీరి వివాహం జూన్‌ 9న జరగనుందని మొన్నటి వరకూ ప్రచారం జరగ్గా.. తాజాగా వేదిక మారినట్లు తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనుందని.. ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం.

సన్నిహితులను వివాహానికి ఆహ్వానిస్తూ నయన్‌ – విఘ్నేశ్‌ ఇప్పటికే వీడియో ఇన్విటేషన్‌ పంపించారని అంటున్నారు. ఆ వీడియో ఇదేనంటూ ఓ చిన్న క్లిప్పింగ్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం.. జూన్‌ 9న మహాబలిపురంలోని మహబ్‌ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది. ఆ తర్వాత మిత్రుల కోసం చెన్నైలో రిసెప్షన్‌ జరిగే అవకాశముందట. ఏడేళ్ల నుండి నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

తమ మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తూ విఘ్నేశ్‌ ఇప్పటికే వివిధ సందర్భాల్లో సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అయితే ఎక్కడా అఫీషియల్‌గా చెప్పలేదు. దీంతో ఆలోచనల్లో ఫ్యాన్స్‌ ఉండగా… కరోనా సమయంలో తమ నిశ్చితార్థం అయిపోయిందని ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో నయనతార చెప్పారు. దీంతో ఫ్యాన్స్‌కి ఒక స్వీట్‌ షాక్‌ తగిలినట్లయింది. అప్పటి నుండి ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ వారి పెళ్లి కోసం. ఆ వెయిటింగ్‌ త్వరలో పూర్తవుతుంది అని చెబుతున్నారు నయన్‌ – విఘ్నేష్‌ సన్నిహితులు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!


పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus