Nayanthara: ఇంతకన్నా నేను ఇంకేం అడగను.. నయన్ పోస్ట్ వైరల్!

నటి నయనతార తాజాగా తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. నవంబర్ 19 వ తేదీ నయనతార పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున నయనతారకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేశారు. ఇలా నయనతారకు ప్రత్యేకంగా సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం నయనతార పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా నయనతార తన భర్త విగ్నేష్ , ఇద్దరు పిల్లలతో కలిసి ఈ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఇందులో భాగంగా తన ఇద్దరి పిల్లలు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేయగా విగ్నేష్ మాత్రం నయనతార నుదుటిపై ముద్దు పెడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలను నయనతార తన ఇంట్లోనే జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియో ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషం వ్యక్తం చేశారు.

ఇంతకంటే నేను ఇంకేం అడగను నాకు దేవుడు ముగ్గురు పిల్లలను ఇచ్చి ఆశీర్వదించారు అంటూ తన సంతోషం వ్యక్తం చేశారు. ఈమె తన భర్తను కూడా పిల్లాడితో సమానంగానే భావించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా ఈమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక నయనతార (Nayanthara) దాదాపు ఏడు సంవత్సరాల పాటు విగ్నేష్ ప్రేమలో ఉంటూ గత ఏడాది వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈమె పెళ్లి జరిగినటువంటి మూడు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు. ప్రస్తుతం ఈ పిల్లలతో ఈమె తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడుపుతోనే మరోవైపు వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా చాలా బిజీగా మారిపోయారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus