కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) సౌత్ ఇండియాలో ఊహించని స్టార్‌డమ్‌ను కొనసాగిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా కమర్షియల్, ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. తమిళంలో స్టార్ హీరోల సినిమాలను ఢీకొట్టేలా హిట్స్ కొట్టిన నయన్, తెలుగులోనూ ‘లక్ష్మీ’ (Lakshmi), ‘సైరా నరసింహా రెడ్డి’ (Sye Raa Narasimha Reddy) వంటి సినిమాలతో మెప్పించింది. బాలీవుడ్‌లో ‘జవాన్’తో (Jawan) షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సరసన నటించి బీ-టౌన్ ఆడియన్స్‌నూ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గకుండా కొనసాగుతోంది.
తాజాగా, నయనతారను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాకు హీరోయిన్‌గా తీసుకునేందుకు నిర్మా=తలు ప్రయత్నిస్తున్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయన్ నటించే అవకాశం ఉందని టాక్. గతంలో చిరంజీవితో ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ (God Father) సినిమాల్లో నటించిన నయన్, ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఒక్కో సినిమాకు రూ.18 కోట్ల వరకు అడుగుతూ, రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్‌కూ ఒప్పానంటోంది.
నయనతార ఈ సినిమాలో ఉంటే బజ్ బాగా వస్తుందని, తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కుతాయని నిర్మాతలు భావిస్తున్నారు. అనిల్ రావిపూడి గత సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సంక్రాంతికి రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ క్రేజ్‌తో చిరంజీవి, నయన్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నయనతార కన్ఫర్మ్ అయితే ఈ మెగా మూవీ తెలుగు, తమిళ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నయనతార స్టార్‌డమ్, చిరంజీవి మాస్ అప్పీల్, అనిల్ రావిపూడి కమర్షియల్ టచ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.