రాజా రాణి అనే డబ్బింగ్ చిత్రంతోనే తెలుగులో బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది నజ్రియా నజీమ్. అటు తర్వాత ఈమె నటించిన మలయాళం సినిమాలను కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకుని తెగ చూశారు తెలుగు ప్రేక్షకులు. ఇక ఈమె తెలుగులో ఎప్పుడు స్ట్రెయిట్ మూవీ చేస్తుందా అని ఇక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి నాని నటిస్తున్న అంటే సుందరనికి?.. చిత్రంతో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈమె భర్త ఫహాద్ పాజిల్ కూడా పుష్ప చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇదిలా ఉండగా వీళ్ళ లవ్ స్టోరీని ఇటీవల ఫాజిల్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అందులో చాలా ట్విస్ట్ లు కూడా ఉన్నాయండొయ్. ఫాజిల్ మాట్లాడుతూ…”ఓసారి నేను ఉంగరం పెట్టి నజ్రియాకు లవ్ లెటర్ పంపాను. అక్కడి నుండే మా లవ్ స్టోరీ మొదలైంది.కానీ ఆ లెటర్ పంపిన వెంటనే ఆమె ‘యస్’ చెప్పలేదు. అలా అని ‘నో’ కూడా చెప్పలేదు. ఆ టైంలో నేను ‘బెంగళూరు డేస్’తో పాటు ఇంకో రెండు సినిమాలకు కమిట్ అయ్యాను. అయినప్పటికీ ఆమె చుట్టూ తిరుగుతు ఉండేవాడిని .
అది కూడా నాకు బాగా నచ్చేది. ఇప్పుడు చెప్పడం కరెక్టో కాదో తెలేదు కానీ.. అప్పట్లో నజ్రియా నాకోసం నేను చాలా వదులుకున్నాను. అది నన్ను చాలా బాధపెట్టింది.అప్పుడు ఓ రకంగా మా కథ ముగిసిపోయింది అనుకున్నాను. అప్పుడు నేను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను. అప్పుడు.. ‘ ఇది కేవలం ఓ సాధారణ జీవితం. అందరితో సర్దుకుపోవాలి’ అంటూ నజ్రియా నాలో ఆత్మస్థైర్యాన్ని నింపింది.అలా నజ్రియా నా జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. నేను సాధిస్తున్న ప్రతి విజయం వెనుక ఆమె పాత్ర ఉంది. ఆమె సపోర్ట్ లేనిదే నేను ఏమి చేయలేను’’ అంటూ ఫహద్ చెప్పుకొచ్చాడు.