NBK107 Teaser: బాలయ్య ఫ్యాన్స్ ను మెప్పించే టీజర్ ఇది..!

నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాని ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ తో సహా ఈ చిత్రంలో చాలా వరకు ‘క్రాక్’ మూవీ టీంనే వాడేస్తున్నాడు దర్శకుడు. అయితే రేపు అనగా జూన్ 9న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ‘ఎన్.బి.కె 107’ నుండి ఓ టీజర్ ని వదిలారు.

ఈ టీజర్లో బాలయ్య మిడిల్ ఏజ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. నోట్లో చుట్ట పెట్టుకుని బాలయ్య ఓ కుర్చీలో కూర్చోవడం.. వచ్చిన రౌడీలను తన కత్తితో నరకడం.. ఆ తర్వాత టెంపుల్ లో ఫైట్ కు సంబంధించిన విజువల్స్ వంటివి ఈ టీజర్లో చూపించారు. ‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్’,’భయం నా బయోడేటాలోనే లేదురా బోసు డీకే’ ‘నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకి కూడా తెలీదు నా కొడకల్లారా’ వంటి ఫ్యాన్స్ ను ఆకట్టుకునే డైలాగులు ఇందులో ఉన్నాయి.

అయితే టైటిల్ ను మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. బహుశా రేపు బాలయ్య పుట్టినరోజు నాడు రివీల్ చేస్తారో లేక దాని కోసం మరో టీజర్ ను వదుల్తారో చూడాలి. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. బోయపాటి స్టైల్లోనే బాలయ్యని చూపించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఏమాత్రం కొత్తదనం లేదు.తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఏమీ కొత్తగా లేదు. నిజానికి బాలయ్య నుండి కొత్తదనం ఆశించడం తప్పే అవుతుంది..! ఈ టీజర్ ఫ్యాన్స్ కు నచ్చుతుంది మిగతా వాళ్లకు రొటీన్ అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!


విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Share.