ప్రభాస్ తో పోటీ పడనున్న బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్
- December 20, 2016 / 05:36 AM ISTByFilmy Focus
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ తో చేయనున్న సినిమాకు విలన్ ఖరారు అయ్యాడు. ప్రస్తుతం బాహుబలి – ది కంక్లూజన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ఫిబ్రవరి నుంచి దర్శకుడు సుజిత్ తో కలిసి పనిచేయనున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో యు.వి.క్రియేషన్స్ వాళ్లు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇందుకోసం హాలీవుడ్ నిపుణులను, బాలీవుడ్ నటులను ఎంపిక చేసుకున్నారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్న ఈ మూవీలో విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడు, తమిళ హిట్ మూవీ కత్తి లో అదరగొట్టిన నీల్ నితిన్ ముఖేష్ సైన్ చేశారు.
తన పాత్ర ఛాలెంజింగ్ ఉండడంతో ఈ ప్రాజక్ట్ కి ఒకే చేసినట్లు రీసెంట్ గా ముంబై లో జరిగిన ఇంటర్వ్యూ లో ఆయన వెల్లడించారు. అంతేకాదు ప్రభాస్ లాంటి హీరో తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషం గా ఉందని నీల్ నితిన్ వివరించారు. డార్లింగ్ అనేక ముద్దుగుమ్మలతో రొమాన్స్ జరుపనున్న ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా అమీ జాక్సన్ నటించనుంది. మొదటి షెడ్యూల్ దుబాయ్ లో ప్రారంభం కానుంది. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















