రాజమౌళి సినిమా అంటేనే సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈయన సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగి పెద్ద ఎత్తున రికార్డులను సృష్టిస్తూ ఉంటాయి. ఈ విధంగా భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.
ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎప్పటిలాగే రికార్డులు సృష్టించింది. ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా నాలుగవ స్థానంలో చోటు తగ్గించుకుంది. ఈ విధంగా థియేటర్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా మే 20వ తేదీ నుంచి ఓటీటీలో ప్రసారమవుతూ ఓటీటీలో కూడా ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ తప్ప మిగిలిన భాషలన్నీ కూడా జీ 5 లో ప్రసారం కాగా కేవలం హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమౌతూ సందడి చేస్తుంది.
ఇకపోతే ఈ సినిమా విడుదలై వంద రోజులు పూర్తి అయినప్పటికీ ఈ సినిమాకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎవరో ఒకరు ప్రశంసల కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమాపై నెట్ ఫ్లిక్స్ సీఈవో స్పందించారు. ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ స్పందిస్తూ….ఇప్పటి వరకు ఎవరైనా హిందీ వెర్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూడనివాళ్లు ఉంటే వెంటనే ఈ సినిమా చూసేయండి.
ఎందుకంటే ఈ ఏడాది వచ్చిన క్రేజీయేస్ట్ థ్రిల్లర్ లలో ఒకటి అంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేశారు. ఈయన పోస్ట్ పై ఆర్ఆర్ఆర్ టీమ్ స్పందిస్తూ కృతజ్ఞతలు వెల్లడించారు.