టీవీలో సినిమా చూస్తూ… ఫుడ్‌ను ఎంజాయ్ చేసేవాళ్లను చూసుంటారు.. మీరు కూడా ఈ పని చేసే ఉంటారు. అయితే దేశంలో ఓటీటీల జోరు పెరిగాక టీవీల ప్లేస్‌లోకి ఓటీటీలు వచ్చేశాయి. ఇప్పుడు టీవీ+ ఫుడ్ కాస్త ఓటీటీ+ ఫుడ్‌గా మారింది. అయితే ఆ ఫుడ్ ఏ రెస్టరెంట్‌లో అయితే ఇంకా బాగుంటుంది అని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. రెండు పనులు ఒకేసారి చేసేలా ఓ రెస్టరెంట్ రాబోతోంది. ప్రస్తుతానికి విదేశాల్లో సిద్ధమవుతున్న ఈ రెస్టరెంట్… త్వరలో మన దేశంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మీరు నెట్‌ఫ్లిక్స్ అంటే ఇష్టమా? ఇదేం ప్రశ్న, అయినా రెస్టరెంట్‌కి నెట్‌ఫ్లిక్స్‌కి ఏం సంబంధం అనుకుంటున్నారా? ఇప్పుడు రెస్టరెంట్ పెట్టబోయేది నెట్‌ఫ్లిక్స్ కాబట్టి. నెట్‌ఫ్లిక్స్ బైట్స్ పేరుతో లాస్ ఏంజిలెస్‌లో ఓ రెస్టారెంట్ ప్రారంభించబోతోంది. దీని కోసం ప్రస్తుతం జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో నెంబర్ వన్ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్‌గా ఉన్న నెట్‌ఫ్లిక్స్ తన వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో కొత్త ఆలోచనలు చేస్తోంది. అదే ఈ రెస్టరెంట్.
2007లో డీవీడీలు అద్దెకు ఇచ్చే వ్యాపారాన్ని ప్రారంభించిన నెట్‌ఫ్లిక్స్ ఆ తర్వాత ఓటీటీ రంగంలో రారాజుగా మారిపోయింది. మధ్యలో ఎంతో కష్టం, ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ బైట్స్ రూపంలో రెస్టరెంట్ తీసుకొస్తోందట. ఇందులో చాలా రకాల సౌకర్యాలు, ఆఫర్లు ఉండబోతున్నాయట. ఇక్కడకు వచ్చేవారికి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లో ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వబోతున్నారట. ఆల్రెడీ ఓటీటీ ఖాతా ఉంటే వాళ్లకు బిల్లులో రాయితీ ఇస్తారట.
ఓటీటీలోని షోస్‌ను అక్కడే హోటల్ స్క్రీన్ మీద ప్రదర్శిస్తారట. ప్రీమియర్ లాంజ్‌లో హోమ్ థియేటర్ లాంటి సెటప్ కూడా ఉంటుందట. అలాగే ఈ రెస్టారెంట్‌లో ప్రముఖ చెఫ్‌లు కర్టిస్ స్టోన్, డామినిక్ క్రేన్, రాడ్నీ స్కాట్, మింగ్ సాయ్, యాంగ్ కిమ్, జాక్వెస్ టోరెస్, ఆండ్రూ జిమ్మర్న్ ఉంటారట. మన దేశం నుండి కూడా ప్రముఖ చెఫ్‌లు అక్కడకు వెళ్తారట. అలాగే ఆ ఓటీటీలో ఉన్న వంటల షోస్‌లో చూపించే వంటకాలు ఇక్కడ లైవ్‌లో చూపిస్తారట. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి అంటున్నారు.