Rajamouli: వాటికి సిద్దమైతే మాత్రమే మల్టీస్టారర్లు చేయాలా?

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించినా చరణ్, తారక్ లను బ్యాలెన్స్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపించాయి. విచిత్రం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ పాత్రల విషయంలో అటు చరణ్ ఫ్యాన్స్ కానీ ఇటు తారక్ ఫ్యాన్స్ కానీ సంతృప్తితో లేరు. గతంలో ఏ మల్టీస్టారర్ విషయంలో వ్యక్తం కాని స్థాయిలో ఈ మల్టీస్టారర్ కు సంబంధించిన స్క్రీన్ స్పేస్ విషయంలో నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్థాయి ఉన్న స్టార్ హీరోలు కావడంతో ఈ సమస్య ఎదురైంది. అదే సమయంలో ఫ్యాన్స్ నుంచి విమర్శలు వ్యక్తమైనా ఫీల్ కాము అనే భావన ఉంటే మాత్రమే స్టార్ హీరోలు మల్టీస్టారర్లు చేయాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. రాజమౌళి లాంటి డైరెక్టర్ విమర్శలు వ్యక్తం కాకుండా మల్టీస్టారర్ ను తెరకెక్కించడంలో ఫెయిల్ కావడంతో బ్యాలెన్స్ చేస్తూ మల్టీస్టారర్లను ఇతర దర్శకులు తెరకెక్కించగలరా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చాలా సంవత్సరాల క్రితం జక్కన్న ఒక ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి హీరోలు సిద్ధమేనని అయితే అభిమానులతోనే సమస్య అని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చెప్పిందే నిజమని ప్రూవ్ అయింది. రాజమౌళి సైతం భవిష్యత్తులో మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాపై దృష్టి పెట్టారు.

ఈ సినిమాపై వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా జక్కన్న పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత వస్తుంది. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను తెరకెక్కిస్తానని రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. మహేష్ ఈ సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus