స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏ సినిమాను తెరకెక్కించినా ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలలో కథ, కథనం ప్రత్యేకంగా ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా జక్కన్న సినిమాలు ఉంటాయి. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కడం వల్లే ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుందని అభిమానులు భావిస్తున్నారు.
తాజాగా షంషేరా మూవీ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించగా కరణ్ మల్హోత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే షంషేరా సినిమాను ఒకవేళ జక్కన్న తెరకెక్కించి ఉంటే మాత్రం ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించి ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
1871 నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ తర్వాత సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించే నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బడ్జెట్ల విషయంలో నిర్మాతలు పొరపాట్లు చేస్తే మాత్రం నిర్మాతలకు తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ మొత్తంలో నష్టాలు మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. బాలీవుడ్ దర్శకులు కొత్త కథలపై దృష్టి పెట్టాలని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.