మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి నిన్న సాయంత్రం 7 గంటలకు ఇటలీ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోలతో నేడు సోషల్ మీడియా కళకళలాడిపోతుంది. మెగా హీరోలందరిని ఒకే చోట చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయి ఫ్యాన్స్ కి. అయితే నిహారిక కొణిదెల పెళ్లి సమయం లో వచ్చినన్ని ఫోటోలు మాత్రం వరుణ్ తేజ్ పెళ్లి కి సంబంధించినవి రాలేదు.
అంతే కాదు, నిహారిక కొణిదెల పెళ్ళికి సంబంధించి వీడియోలు కూడా అప్పట్లో హల్చల్ చేసాయి, మెగా హీరోలందరూ డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేసిన వీడియోలు చూస్తే ఇప్పటికీ కనులపండుగ లాగా ఉంటుంది. నాగబాబు భవిష్యత్తులో తన యూట్యూబ్ ఛానల్ లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్ళికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు చూసి ఒక విషయాన్నీ బాగా గమనించొచ్చు.
గుడి లాగ భావించే కల్యాణ మండపం పైకి (Nagababu) నాగబాబు చెప్పులు వేసుకొని వెళ్ళాడు. పెళ్లి మండపాన్ని గుడిగా, అలాగే వధూవరులను దేవతలుగా భావిస్తారు మన హిందువుల సంప్రదాయం ప్రకారం. అలాంటి ఉన్నంతమైన పద్దతులను అనుసరించకుండా సొంత కొడుకు పెళ్ళిలో నాగబాబు ఇలా చెయ్యడం ఏమాత్రం బాగాలేదని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి అరిష్టమైన కార్యక్రమాలు చెయ్యడానికి ముందు మన శాస్త్రాలు ఏంటో ఒకసారి తెలుసుకోవాలి,
ఇంత వయస్సు వచ్చి కూడా ఇలాంటివి తెలియకపోవడం శోచనీయం అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఇటలీ లో జరిగిపోయింది. త్వరలోనే హైదరాబాద్ లో కూడా వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.