Akhanda Movie: బోయపాటిపై నెటిజన్ల విమర్శలు.. కారణాలివే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ బాక్సాఫీస్ లెక్కలను సరి చేస్తోంది. మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటోంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అఖండ సినిమాలో విలన్ శ్రీకాంత్ నటి పూర్ణపై అఘాయిత్యానికి పాల్పడతాడు. గతంలో కూడా చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. అయితే శ్రీకాంత్ పూర్ణ కొడుకు ముందు అత్యాచారానికి పాల్పడటం ఆమోదయోగ్యమైన సీన్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీన్ విషయంలో బోయపాటి శ్రీను తప్పు చేశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో కలెక్టర్ పాత్ర చేసినా ఆ పాత్రలో హుందాతనం కనిపించలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కలెక్టర్ అయిన ప్రగ్యా జైస్వాల్ హీరోతో కల్లు తాగించడం, ఆవకాయ నాకించడంలాంటి సన్నివేశాలకు కూడా నెటిజన్ల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ కామెంట్ల గురించి బోయపాటి శ్రీను ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లో హీరో ఎవరనే సంగతి తెలియాల్సి ఉంది. బోయపాటి శ్రీను ఖాతాలో సక్సెస్ చేరడంతో స్టార్ హీరోలు బోయపాటి శ్రీనుతో పని చేయడానికి ఆసక్తి చూపే అవకాశం అయితే ఉంది. 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ వల్ల నిర్మాతలకు భారీగానే లాభాలు వచ్చాయని సమాచారం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus