చాలా కాలంగా నితిన్ (Nithiin) ఓ సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. కోవిడ్ తర్వాత నితిన్ ఖాతాలో సరైన హిట్టు పడలేదు. ‘రంగ్ దే’ యావరేజ్ గా ఆడింది. ‘మ్యాస్ట్రో’ (Maestro) ఓటీటీకి వెళ్లి సేఫ్ అయ్యింది. కానీ ‘చెక్’ (Check) ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) ‘ఎక్స్ట్రా’ (Extra Ordinary Man) వంటి సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘రాబిన్ హుడ్’ తో (Robinhood) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మార్చి 28న ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రమోషన్స్ అయితే బాగానే చేశారు. బజ్ క్రియేట్ అవ్వలేదు. నిన్న వదిలిన ట్రైలర్ బాగానే ఉన్నా కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అయితే ‘రాబిన్ హుడ్’ కి స్పెషల్ అట్రాక్షన్ ఏమైనా ఉందా? అంటే అది కచ్చితంగా వార్నర్ కామియో అనే చెప్పాలి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ వార్నర్ కోసం ఈ సినిమాకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ అతని రోల్ కనుక ఆకట్టుకునే విధంగా లేదు అంటే.. వాళ్ళే పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టే ప్రమాదం ఉంది.
3 ఏళ్ళ క్రితం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘లైగర్’ (Liger) సినిమా వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ తో ఒక రోల్ చేయించారు. ‘అది సినిమాలో పండలేదు. అతికించినట్లు ఉంది’ అనే విమర్శలు వచ్చాయి. ఆ రీజన్ తో ఇంకాస్త ఎక్కువ ట్రోలింగ్ జరిగింది. అందుకే ‘ ‘లైగర్’ లా ‘రాబిన్ హుడ్’ కాదు కదా?’ అంటూ నితిన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతూ సోషల్ మీడియాలో చర్చలు పెట్టుకుంటున్నారు.