సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కు.. తన కారు కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందట. విషయం ఏంటి అంటే గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రజనీ. ఆయన స్వయంగా తన బీఎండబ్ల్యూ కారులో చెన్నై నుండి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత రాత్రికి అక్కడే బస చేసి తర్వాతి రోజు అనగా గురువారం నాడు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ రజనీ ప్రయాణించిన బి ఎం డబ్ల్యూ ఎక్స్ 5 మోడల్ కారు చెన్నై సౌత్ ఈస్ట్‌లోని మందవేలి ఆర్‌టీఓ కార్యాలయంలో ఆగస్టు 4, 2016న రిజిస్ట్రేషన్ అయింది. సాధారణంగా వాహనాలకు ఏడాదికో, రెండేళ్లకో ఓసారి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. కానీ రజనీ ప్రయాణించిన టీఎన్ 06 ఆర్ 9297 కారుకి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించలేదు. ఆగస్టు 02, 2021లోనే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయ్యింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇదే సామాన్యులకైతే భారీగా ఫైన్ వేసేస్తారు ట్రాఫిక్ పోలీసులు. మరి కోట్ల రూపాయలు సంపాదించే రజనీకాంత్ వంటి స్టార్లకు మాత్రం ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ వర్తించవా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటివరకు చెన్నై ట్రాఫిక్ పోలీసులు ఈ కారుని ఎలా వదిలేశారు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.ఈరోజు కడపలో ఉన్న దర్గా వద్దకు కూడా వెళ్లారు రజని. ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.