తన సృజన, హార్డ్ వర్క్ పై గట్టి నమ్మకంతో సినిమాలు తీసి అపూర్వ విజయాలు అందుకున్నారు రాజమౌళి. రాజమౌళితో ఓ హీరోకి మూవీ చేసే అవకాశం రావడం అంటే, వ్యక్తిగత రికార్డులతో పాటు, ఇండస్ట్రీ రికార్డులు మార్చివేస్తాం అని ఫిక్స్ అయిపోతారు. తెలుగు సినిమాకు కనీసం వంద కోట్ల మార్కెట్ కూడా లేనప్పుడు, వందల కోట్ల బడ్జెట్ తో బాహుబలి మూవీ చేయడం సాహసమే. కానీ తనపై నమ్మకమున్న రాజమౌళి ధైర్యంగా ముందుకు వెళ్లి, భారత చలన చిత్ర రికార్డ్స్ మొత్తం చెరిపివేశారు.
ఐతే ఆర్ ఆర్ ఆర్ విషయంలో మాత్రమే రాజమౌళి లెక్కలు మొత్తం మారిపోయాయి. ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఎదురైన ఆటంకాలు, ఇబ్బందులు రాజమౌళి ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఆర్ ఆర్ ఆర్ మొదటి నుండి అవరోధాల మయం కాగా, ఆర్ ఆర్ ఆర్ అసలు పూర్తి చేయగలనా అనే భయం రాజమౌళిని వెంటాడుతుంది. దానికి కారణం కరోనా వైరస్ తో మరో ఏడాది పోరాటం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న వేళ, ఆయనకు టెన్షన్ పెరిగిపోతుంది.
ఈ మూవీకి విదేశీ నటులు, మరియు ప్రపంచ స్థాయి నిపుణులు పనిచేస్తున్న తరుణంలో, వారు అసలు ఇండియాకి వచ్చి మూవీ షూటింగ్ లో పాల్గొనడం సాధ్యమేనా అనే సందేహం కలుగుతుంది. దీనికి తోడు మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యే కొలది బడ్జెట్ పెరిగిపోతుంది. ఓ వైపు థియేటర్స్ భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదు. మరి ఆర్ ఆర్ ఆర్ రాబట్టాల్సిన వందల కోట్ల వసూళ్లు సాధ్యమేనా అనేది రాజమౌళి మరో సందేహం. దీనితో ఎన్నడూ లేనిది, రాజమౌళి ఒత్తిడి ఫీలవుతున్నారట.