దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ అనుకున్న డేట్ కు విడుదలవుతుందా..? లేదా..? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారితే ఆ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా సినిమాలపై పడే అవకాశం ఉంటుంది. అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశారని సమాచారం. క్లైమాక్స్ లో కొన్ని షాట్ల చిత్రీకరణ మిగిలి ఉందని కరోనా విజృంభణ తగ్గితే ఆ సన్నివేశాల చిత్రీకరణ కూడా రాజమౌళి పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.
భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో నిర్మాత దానయ్యకు బడ్జెట్ కు రెట్టింపు లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా చరణ్, తారక్ కెరీర్ లలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే నాటికి కరోనా కేసులు కూడా తగ్గుతాయని రాజమౌళి భావిస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకు అన్ని పనులు సవ్యంగానే జరుగుతున్నా వీఎఫ్ఎక్స్ పనులతోనే అసలు సమస్య అని తెలుస్తోంది.
రాజమౌళి క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడరనే సంగతి తెలిసిందే. రాజమౌళి టెన్షన్ పడకపోయినా వీఎఫ్ఎక్స్ టీమ్ ను మాత్రం తెగ టెన్షన్ పెడుతూ పనులు చేయిస్తున్నారని సమాచారం. అక్టోబర్ 13వ తేదీనే ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తుండగా కరోనా సెకండ్ వేవ్ ను బట్టి రిలీజ్ డేట్ విషయంలో రాజమౌళి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.