2020 ప్రపంచం మొత్తానికి ఓ బ్లాక్ ఇయర్. కరోనా ఎంట్రీ ఇవ్వడం.. లాక్ డౌన్ ఏర్పడడంతో అన్ని పరిశ్రమలు ఆర్ధికంగా చాలా దెబ్బ తిన్నాయి. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమ. అప్పటికి షూటింగ్ దశలో ఉన్న సినిమాలు ఆగిపోయాయి.తరువాత థియేటర్లు మూతపడడంతో విడుదల కావాల్సిన సినిమాలు కూడా ఆగిపోయాయి. అయితే డిసెంబర్ నుండీ మళ్ళీ థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రతీ శుక్రవారం రెండు,మూడు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి.చిన్న, మీడియం రేంజ్ సినిమాలే అయినప్పటికీ జనాలు కరోనాని లెక్క చెయ్యకుండా బాగానే థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు.
దాంతో పెద్ద సినిమాలను కూడా విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ఇటీవల వచ్చిన ‘జాతి రత్నాలు’ చిత్రం వల్ల ఓవర్సీస్ మార్కెట్ కూడా గాడిలో పడింది. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఇప్పుడు కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. గత 3 రోజుల్లోనే ఇండియాలో లక్ష కేసులు నమోదయ్యాయి. 600 మందికి పైగా దీని వల్ల ప్రాణాలు కోల్పోయారు. మొన్నటివరకూ లాక్ డౌన్ పెట్టేదే లేదు అని చెప్పిన ప్రభుత్వాలు.. ఇప్పుడు లాక్ డౌన్ వైపే దృష్టి మళ్లించినట్టు టాక్ వినిపిస్తుంది.
వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం కరోనా భారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ లేదా వీకెండ్ లో లాక్ డౌన్ చెయ్యాలని ముఖ్యమంత్రులు యోచిస్తున్నట్టు చర్చ జరుగుతుంది. ఇలా అయితే కొత్త సినిమాలకు పెద్ద దెబ్బ పడినట్టే అని చెప్పాలి. అందుకే టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో కలవరం మొదలైనట్టు సమాచారం.
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!