Nidhhi Agerwal: పవన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా : నిధి అగర్వాల్
- March 31, 2021 / 09:04 PM ISTByFilmy Focus
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో సక్సెస్ సాధించడంతో పాటు గుర్తింపును సంపాదించుకున్న నిధి అగర్వాల్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు జోడీగా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని నిధి అగర్వాల్ అన్నారు.
తాను పవన్ కళ్యాణ్ కు చాలా పెద్ద ఫ్యాన్ నని.. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరుతోందని చెప్పారు. పవన్ చాలా అద్భుతమైన నటుడని నిధి అగర్వాల్ ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయడం గొప్ప అనుభూతిని ఇస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ చుట్టూ ఏదో శక్తి ఉందని.. పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగు పెడితే అందరూ ఆయననే చూస్తూ ఉండిపోతారని ఆమె అన్నారు.

ఏదైనా సీన్ కోసం రిహార్సల్స్ చేయాల్సి వస్తే పవన్ ఎంతో ఆనందంగా రిహార్సల్స్ చేస్తారని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆమె అన్నారు. ఈ సినిమాలో రాజసం ఉట్టిపడే వస్త్రాల్లో తాను కనిపిస్తానని.. వెండితెరపై తన పాత్రను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె వెల్లడించారు. గత సినిమాల్లోని పాత్రలకు 20 నిమిషాల టైమ్ పడితే ఈ సినిమాలోని పాత్ర కోసం 90 నిమిషాల సమయం పడుతోందని ఆమె తెలిపారు.

ఎ ఎం రత్నం సమర్పిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచడం గమనార్హం.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

















