తెలుగులో హీరోయిన్ గా కంటే ప్రొడ్యూసర్ గా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న నిహారిక (Niharika Konidela), ఇదివరకు తమిళంలోనూ హీరోయిన్ గా ప్రయత్నించి అక్కడ కూడా సరైన విజయం దక్కపోవడంతో.. తెలుగునాట ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతూ ఈ ఏడాది “కమిటీ కుర్రాళ్లు” (Committee Kurrollu) అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాక “బెంచ్ లైఫ్” అనే సిరీస్ ను రిలీజ్ చేసి మంచి విజయం అందుకొంది. అయితే.. హీరోయిన్ గా సూపర్ హిట్ అందుకోవాలన్న ఆశ మాత్రం నిహారిక మనసులో ఉండిపోయింది.
Niharika Konidela
అందుకే ఈసారి తెలుగు, తమిళంలో కాక మలయాళంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అక్కడ గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షేన్ నిగమ్ హీరోగా “మదరాస్కారన్” అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన “చెలి” చిత్రంలోని “అలలే చిట్టి అలలే” పాటను రీమిక్స్ చేశారు.
ఈ పాటను మలయాళంలో మంచి రొమాంటిక్ నెంబర్ లా తెరకెక్కించారు. ఈ పాటలో నిహారిక హాట్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి నిహారిక ఎక్కడ శృతి మించిన ఎక్స్ పోజింగ్ కానీ, ఇబ్బందిపడే భంగిమలు కానీ ప్రయత్నించలేదు. కానీ.. ఆమె ఎక్స్ ప్రెషన్స్ & డ్యాన్స్ మూవ్స్ మాత్రం కుర్రకారుకి కైపెక్కిస్తున్నాయి. మరి హీరోయిన్ గా హిట్టు కొట్టాలన్న నిహారిక కల ఈ మలయాళ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి.
ఇకపోతే.. నిహారిక (Niharika Konidela) తెలుగులోనూ హీరోయిన్ గా తన సత్తా చాటుకొనేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించబోయే రెండు ప్రాజెక్ట్స్ ఎనౌన్స్ చేయనున్నారు. కొత్త దర్శకులతో ఉండబోయే ఈ సినిమాల్లో ఒకటి నిహారిక స్నేహితులతో కలిసి నిర్మించనుందని సమాచారం.