జూనియర్ ఎన్టీఆర్ ను (Jr NTR) తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. తారక్ యాక్టింగ్ స్కిల్స్ కు పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తారక్ నటించిన సినిమాలలో కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలలో సాంబ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో చదువు గొప్పదనం గురించి ప్రధానంగా చర్చించారు. ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నిహారిక రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇంటర్ చదివే సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల పేరెంట్స్ హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడ్డారని ఆమె తెలిపారు.
ఆ సమయంలో సాంబ (Samba) మూవీ విడుదలైందని ఈ సినిమా మేకర్స్ విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తున్నట్టు ఒక ప్రకటన చేశారని నిహారిక రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి స్కాలర్ షిప్ పొందాలని భావించి పట్టీలు, కమ్మలు అమ్మేసి ఆ డబ్బులతో హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఆఫీస్ కు వెళ్లానని ఆమె తెలిపారు.
ఉదయాన్నే ఎన్టీఆర్ ఆఫీస్ కు వెళ్లగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి సాంబ మూవీ అంచనాలను అందుకోలేదని కొంతమంది స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్ ఇచ్చి ఉండవచ్చని కొత్తగా ఇవ్వడం మాత్రం కష్టమని చెప్పారని ఆమె తెలిపారు. ఈ ఇండస్ట్రీ అంత మంచిది కాదని చెప్పడంతో నేను అక్కడినుంచి తారక్ ను కలవకుండానే వెళ్లిపోయానని నిహారిక రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత నా కెరీర్ లో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా ఛాన్స్ వచ్చినా వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. నిహారిక రెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నిహారిక రెడ్డి ప్రస్తుతం క్యాస్టూమ్ డిజైనర్ గా కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు