‘రంగ్‌దే’ టీజర్ చూశాక… అదేంటి నితిన్ బాగా సన్నబడినట్లున్నాడే అని అందరూ అనుకున్నారు. ఈ సినిమా కోసం అంత తగ్గాల్సిన అవసరం ఏంటి.. యాక్షన్ బేస్డ్ సినిమా కాదు.. పేరు చూస్తే లవ్ స్టోరీలానే ఉంది కదా అని అందరూ అనుకున్నారు. అయితే నితిన్ ఆ సినిమా కోసం బరువు తగ్గడం వెనుక కారణం ఉందట, దాని కోసం ఆయన పడ్డ కష్టమూ ఉందట. ఇటీవల ఆ ‘స్లిమ్’ నితిన్ గురించి ఆయనే చెప్పుకొచ్చాడు. దాని కోసం నితిన్ పడ్డ కష్టం చూస్తే.. వావ్ అనిపిస్తుంది.
‘రంగ్‌దే’ సినిమాలో నితిన్ కాలేజ్ స్టూటెండ్‌గా కనిపిస్తాడు. ప్రచార చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. దీని కోసం నితిన్ తనను తాను చాలా మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం నితిన్ 30`sలో ఉన్నాడు. ఈ సమయంలో కాలేజ్ స్టూడెంట్‌లా కనిపించాలంటే కొంచెం కష్టపడాలి. అంతకంటే ముందు దర్శకుడు వెంకీ అట్లూరి ఈ విషయం చెప్పగానే నితిన్ షాక్ అయ్యాడట. నేనా స్టూడెంట్‌లానా అంటూ అడిగాడట. అసలు ఇది సాధ్యమా అని కూడా అన్నాడట.
స్టూడెంట్‌లా కనిపించే విషయంలో నితిన్ అనుమానాన్ని వెంకీ క్లియర్ చేసి.. నచ్చజెప్పి నటించేలా చేశాడట. వెంకీ కథ చెప్పిన విధానం నితిన్‌కి బాగా నచ్చిందట. దీంతో యువకుడిగా కనిపించడం కోసం ఫిట్‌నెస్ విషయంలో చాలా శ్రమించాడు. బరువు తగ్గి.. గడ్డం తీసేశాడు. బరువు తగ్గడం కోసం ఎంత కష్టపడ్డాడో నితిన్ సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతుంది. హీరోలు ఇప్పడు బరువు తగ్గడం, పెరగడం కొత్తేం కాదు. కానీ లవ్ స్టోరీలా కనిపిస్తున్న ‘రంగ్‌దే’ కోసం ఇంత తగ్గాడా అనేది ఆసక్తికరం కదా.
దర్శకుడు వెంకీ అట్లూరితో ఉన్న అనుబంధం కూడా నితిన్ చెప్పాడు. ‘‘12 ఏళ్ల నుండి నేను, వెంకీ మంచి స్నేహితులం. నన్ను ఉత్తమంగా చూపించాలో వెంకీకి తెలుసు. అందుకు తగ్గట్టుగా సినిమాను తీర్చిదిద్దాడు. నా పాత్ర అందరికీ నచ్చుతుంది. కామెడీ, లవ్, డ్రామా ఇలా అన్నీ ఉండేలా వెంకీ చూసుకున్నాడు. ఇన్ని కోణాలు ఉన్న ఓ పాత్రను ఇటీవల కాలంలో నేను పోషించలేదు’’ అని చెప్పుకొచ్చాడు నితిన్. ఈ నెల 26న ఈ సినిమా విడుదలవుతుంది.