గత కొన్నేళ్లలో కమల్ హాసన్ నటించిన తెలుగు సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. అయితే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కి జూన్ 3వ తేదీన థియేటర్లలో విడుదలవుతున్న విక్రమ్ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో నటించడం గమనార్హం. హీరో సూర్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కొన్ని క్షణాల పాటు కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కింది. ఈ సినిమా తెలుగు హక్కులను నితిన్ సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా హక్కుల కోసం నితిన్ ఎంత మొత్తం ఖర్చు చేశారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ సినిమాతో నిర్మాతగా నితిన్ సక్సెస్ ను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం నితిన్ కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు.
ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా భారీస్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాతో నితిన్ బిజీగా ఉన్నారు. తర్వాత సినిమాలతో నితిన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.
కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా నితిన్ కు లాభాలను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా కమల్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకం కానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.