నితిన్ – కీర్తి సురేష్ ‘రంగ్ దే’ రిలీజ్ డేట్ ఫిక్స్?

‘అ ఆ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ‘లై’ ‘ఛల్ మోహన్ రంగ ‘ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి మూడు డిజాస్టర్ లు చవి చూసాడు నితిన్. దాంతో ఓ సంవత్సరం గ్యాప్ తీసుకుని వెంకీ కుడుముల డైరెక్షన్లో ‘భీష్మ’ చిత్రం చేసి సూపర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఎగ్జామ్స్ సీజన్, కరోనా వైరస్ వంటి అడ్డంకులు లేకపోతే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఇదే జోష్ లో తన నెక్స్ట్ సినిమాని కూడా ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘రంగ్ దే’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

Nithiin RangDe Movie Taragating RRR Movie1

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మొదట సమ్మర్ కి విడుదల చెయ్యాలని టీం భావించారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయని భావించి ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ డేట్ కి విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. అలా అని 2021 జనవరి 8 కాదండోయ్.. మొదట ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాకపోవడంతో పోస్ట్ పోన్ చేశారు. దీంతో ఆ డేట్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ డేట్ ను ‘రంగ్ దే’ టీం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ టైంకి వేరే సినిమాలు కూడా లేవు కాబట్టి.. నితిన్ కి కలిసొచ్చే అంశం అని చెప్పాలి.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.