గత రెండ్రోజులుగా “గేమ్ ఛేంజర్” (Game Changer) వాయిదాపడింది అంటూ వస్తున్న వార్తలకు దిల్ రాజు (Dil Raju) తెరదించారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా చురుగ్గా జరుగుతుందని, అనుకున్నప్రకారం డిసెంబర్ లో విడుదల చేయడం పక్కా అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. దిల్ రాజు ఇంత నమ్మకంగా చెప్పడంతో.. సినిమాపై వచ్చిన ఇప్పటివరకు వచ్చిన అనధికారిక వార్తలన్నీ ఒక్కసారిగా కొట్టుకుపోయాయి.
Game Changer
అదే సందర్భంలో దిల్ రాజు “గేమ్ ఛేంజర్ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన భారీ సినిమా అని, అందులోని సామాజిక అంశాలకు జనాలు బాగా కనెక్ట్ అవుతారు” అంటూ పేర్కొనడం సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇకపోతే.. “ఇండియన్ 2” (Indian 2) రిలీజ్ తర్వాత శంకర్ (Shankar) పై నమ్మకం పోయింది ప్రేక్షకులకు, ఆయనలో కంటెంట్ లేదని, ఇదే తరహాలో “గేమ్ ఛేంజర్” ఉంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ తల ఎత్తుకోలేరని సోషల్ మీడియాలో హల్ చల్ జరిగిన విషయం తెలిసిందే.
అయితే.. గేమ్ ఛేంజర్ టీమ్ చెప్పేది ఏంటంటే.. “ఇండియన్ 2” సినిమాకి వచ్చిన రెస్పాన్స్ & ఫీడ్ బ్యాక్ ను చాలా సీరియస్ గా తీసుకున్న శంకర్.. “గేమ్ ఛేంజర్” పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకొంటున్నాడని, ఈ సినిమాతో పక్కా హిట్ కొడతాడని చెప్పుకొస్తున్నారు. చరణ్ (Ram Charan) కూడా ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
సో, “గేమ్ ఛేంజర్”తో రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ గా రాజమౌళి కర్స్ నుండి బయటపడతాడో లేదో చూడాలి. ఇకపోతే.. ఈ సినిమా ప్రమోషన్స్ ను అక్టోబర్ నుండి మొదలుపెట్టనున్నారు బృందం, అప్పటివరకు సినిమా టీమ్ నుండి పెద్దగా అప్డేట్స్ ఏమీ ఉండవనే చెప్పాలి. అప్పటివరకు చరణ్ ఫ్యాన్స్ అందరూ “జరగండి” సాంగ్ తో టైమ్ పాస్ చేయాలన్నమాట.