ఓ సినిమాను ఆకాశానికెత్తడం, వద్దనుకుంటే అదే సినిమాను నేలకు దించేయడం సోషల్ మీడియాకు అలవాటే. దీనికి ఇటీవల ఉదాహరణ అంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ అని చెప్పాలి. సినిమా విడుదలకు ముందు సినిమాకు ఫుల్ పాజిటివ్ బజ్ కనిపించగా, విడుదలైన తర్వాత కొంచెం నెగిటివిటీ కనిపించింది. పొరుగింటి పుల్లగూర రుచి అన్నట్లుగా ‘కేజీయఫ్ 2’ సినిమాను ఆకాశానికెత్తేశారు. మన తెలుగు రైటర్లకు అలాంటి రైటింగ్, టేకింగ్ రావు అన్నట్లుగా విమర్శలు చేశారు కొంతమంది నెటిజన్లు. అయితే ఇప్పుడు పరిస్థితి డిఫరెంట్‌గా ఉంది. ‘ఆర్ఆర్‌ఆర్’కి సోషల్ మీడియాలో ఇప్పుడొస్తున్న బజ్… ‘కేజీయఫ్ 2’కి లేదనే చెప్పాలి.
‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా మీద ఆక్రోశాన్ని ‘కేజీయఫ్ 2’పై ప్రేమగా మలుచుకున్నారు ఆ సినీ ప్రియుల మాస్క్‌లో ఉన్న హేటర్స్. ఓటీటీలో సినిమా చూడటానికి అదనంగా డబ్బులు కట్టాలి అని ‘ఆర్‌ఆర్ఆర్’, ‘కేజీయఫ్ 2’ టీమ్‌లు చెప్పినప్పుడు ఒక్కసారిగా మళ్లీ నోళ్లకు పని చెప్పారు. ఇంతలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఈ విషయంలో వెనకడుగు వేసింది. ‘కేజీయఫ్ 2’ మాత్రం అలానే కొనసాగింది. ఈ సమయంలో ‘కేజీయఫ్ 2’ను ఎవరూ ఏమీ అనలేదు. అయితే వసూళ్ల విషయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ‘కేజీయఫ్ 2’ దాటేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’దే ఇప్పటికీ హవా.
రీసెంట్ డేస్‌లో సోషల్ మీడియాలో, రేటింగ్స్ వెబ్‌సైట్స్‌లో, విదేశాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ హవానే కనిపిస్తోంది. రోటెన్ టమోటాస్ టాప్ మూవీస్ 2022 లిస్ట్‌లో అవెంజర్స్ ఎండ్‌గేమ్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ దాటేసింది. ఇటీవల ‘ఆర్ఆర్‌ఆర్ ఎన్‌కోర్’ పేరుతో ఓవర్సీస్‌లో సినిమా రీరిలీజ్ చేసినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో హాలీవుడ్, ఇంట్నేషన్ సెలబ్రిటీలు సినిమాను పొగుడుతున్నారు. ఇలాంటివి ‘కేజీయఫ్ 2’ విషయంలో కనిపించడం లేదు.
దీంతో థియేటర్‌లో ‘కేజీయఫ్ 2’ సత్తా ఉన్నా.. బయట మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’దే హవా అని చెప్పొచ్చు. నెట్‌ఫ్లిక్స్, జీ5 ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్ట్రీమ్ అవుతుండటంతో ఫుల్ స్వింగ్‌లో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా సినిమా కొత్త బజ్‌కి కారణం అని చెప్పొచ్చు.