“పెళ్ళిచూపులు” చిత్రంలో “నా సావు నేసు సస్తా.. నీకెందుకు” అనే పుస్తక రచయితగా తెలుగు తెరపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయావ్.. “నువ్వు లక్కీ” అంటూ తన సన్నిహితులు, స్నేహితులు మరియు తెలిసినవారు అంటుండడం ప్రియదర్శికి అస్సలు నచ్చడం లేదట. అందుకే ఫేస్ బుక్ సాక్షిగా “నా కష్టాన్ని కూడా గుర్తించండి” అంటూ తన మనసులో మాటను పంచుకొన్నాడు.
“నువ్వు లక్కీరా, రాత్రికి రాత్రి స్టార్ అయ్యావ్” అని చాల మంది అంటుంటే, అవునా? ఇది నిజామా అని ఒక్కసారి ఆలోచించాను, కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు, పనికోసం అలమటించిన రోజులు, ఎంతపని చేసిన గుర్తింపు, గౌరవం, డబ్బు దక్కని క్షణాలు, మద్యతరగతి కుటుంబంలో ఉండే భయాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయ్. నచ్చిన పని దొరక్క నచ్చని పని చేస్తూ మనస్థాపం చెంద్దిన రోజులు ఎన్నో ఉన్నాయ్. రోజువారీగా ఆడిషన్లకు వెళ్తూ ప్రతిరోజు ఓడిపోయినా క్షణాలు నిన్న మొన్నటిదాకా షరామామూలే. వేరే గొప్ప నటులతో పోలిస్తే నా కష్టాలు, కన్నీళ్లు చాల చిన్నవికావొచ్చు, తీవ్రంగా విశ్లేషిస్తే నావి అసలు కష్టాలు కాకపోవొచ్చు కానీ “లక్కీ” అనే పదం ఎందుకో మింగుడు పడదు, లక్కీ అనడం వల్ల నా కష్టాన్ని శ్రమని చిన్నచూపు చూసినట్టె అవుతుంది.
ఇది నా సౌభాగ్యమో లేక వారి మంచితనమో, నా ప్రయాణంలో గొప్ప వ్యక్తులని – కళకారులని కలుసుకోవడం, వారితో పనిచేసే ‘అవకాశం’ నాకు కలిగింది. నేడు నేను స్టార్ అవ్వలేదు (అవ్వదలుచుకోలేదు కూడాను) కేవలం ఈ 6 ఏళ్ళ పడ్డ కాష్ఠానికి గుర్తింపు వచ్చింది. ఇంకా చేయెల్లసింది చాలానే ఉంది.