యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ కాకుండా హైయెస్ట్ షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో జనతా గ్యారేజ్ కూడా ఒకటి. ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్న సమయంలో మరో సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడింది ఆచార్య ఫ్లాపైనా కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బన్నీ కోసం తయారు చేసిన కథతోనే ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించనున్నారని ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ 30 హిందీలో కూడా రిలీజ్ కానుండగా బాలీవుడ్ ఆడియన్స్ నుంచి ఈ మోషన్ పోస్టర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ వాయిస్ కు గూస్ బంప్స్ వస్తున్నాయని హిందీ ఆడియన్స్ చెబుతున్నారు. ఎన్టీఆర్ రియల్ పాన్ ఇండియా యాక్టర్ అని నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.
ఫేస్ రివీల్ చేయకుండా రిచ్ లుక్స్ లేకుండా 47 సెకన్ల వీడియోతో తారక్ సంచలనాలను సృష్టించారని హిందీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ మైండ్ బ్లోయింగ్ అని ఇండియాస్ మోస్ట్ ప్రొఫెసనల్ యాక్టర్ అని హిందీ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ నుంచి మరో మాస్టర్ పీస్ రాబోతుందని ఫ్యాన్స్ వెల్లడించారు. అనిరుధ్ మ్యూజిక్ కు కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!