అన్నిరంగాల్లోని కళాకారులను సినీ రంగం తనలో ఐక్యం చేసుకుంటుంది. కుల, మత, జాతి భేదం లేకుండా ప్రతిభ ఉంటే అందలమెక్కిస్తానంటుంది. అందుకే ఎంతోమంది తమ అదృష్టాన్ని ఇక్కడ పరీక్షించుకొని పాపులర్ అయ్యారు. అలా చిత్రాలపై మక్కువతో సినీలోకానికి వచ్చిన ఎన్నారైలపై ఫోకస్…
వరుణ్ సందేశ్హ్యాపీ డేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ స్వస్థలం ఒరిస్సాలోని రాయగడ. వీరి కుటుంబం అమెరికాలో సెటిల్ కావడానికి ముందు నాలుగేళ్లపాటు హైదరాబాద్ లో నివసించింది. వరుణ్ హైయ్యర్ స్టడీస్ మొత్తం అమెరికాలోనే సాగింది. శేఖర్ కమ్ముల నిర్వహించిన ఆడిషన్స్ లో పాల్గొని నటుడయ్యారు.
అను ఇమ్మాన్యుయేల్నేచురల్ స్టార్ నాని మజ్ను చిత్రంలో అందరినీ గిలిగింతలు పెట్టిన ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ చికాగోలో పుట్టి పెరిగింది. మలయాళీ కుటుంబానికి చెందిన ఈ భామకు సినిమాలపై ఆసక్తి ఉండడంతో చిన్నప్పటి నుంచే నటించింది. హీరోయిన్ గా “యాక్షన్ హీరో బిజూ” అనే మలయాళీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
వెన్నెల కిషోర్నిజామాబాద్ కి చెందిన కుర్రోడు వెన్నెల కిషోర్. అతను స్టడీ అనంతరం అమెరికా వెళ్లి సాఫ్ట్ వేర్ క్వాలిటీ ఇంజినీర్ గా పనిచేశారు. ఆ ఫీల్డ్ సంతృప్తి ఇవ్వకపోవడంతో మనసు లాగుతున్న సినిమాల వైపే వచ్చేసారు. తాను నటించిన వెన్నెల మూవీ టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్నారు.
ఆషీకమాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాలో హీరోయిన్ ఇలియానాకు చెల్లెలుగా నటించిన ఆషీక కు పెద్ద చరిత్ర ఉంది. ఈమె హాలీవుడ్ చిత్రం “గయానా 1838 “లో నటించింది. మనదేశంలోని సింధి వర్గానికి చెందిన ఈమె న్యూయార్క్ లో సెటిల్ అయింది. నటిగా పేరు తెచ్చుకోవాలని కసితో ముంబైలో ఉండి సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నిస్తోంది.
అడివి శేష్తెలుగు పరిశ్రమల్లోని మల్టీ ట్యాలంటెడ్ యువకుల్లో అడివి శేష్ ఒకరు. హీరో, విలను పాత్రలలో మెప్పించే శేష్ కి రచన, స్క్రిప్ట్, డైరక్షన్ విభాగాల్లో మంచి పట్టుఉంది. ఇతను పుట్టింది హైదరాబాద్ అయినప్పటికీ పెరిగింది, చదువుకుంది మొత్తం అమెరికాలోనే. సినిమాపై ప్యాషన్ తో ఇక్కడకు వచ్చారు. తన ప్రతిభను నిరూపించుకున్నారు.
విమలా రామన్ఎవరైనా ఎప్పుడైనా .. చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన విమలా రామన్ ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయురాలు. మిస్ ఇండియా ఆస్ట్రేలియా, మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటాలను దక్కించుకున్న ఈ భామ దక్షిణాది అన్ని భాషల సినిమాల్లో నటించింది.
రిచా గంగోపాధ్యాయలీడర్ చిత్రంలో క్యూట్ గా కనిపించి యువకుల హృదయాలను కొల్లగొట్టిన రిచా గంగోపాధ్యాయ పుట్టింది ఢిల్ల్లీలోనే. ఆమె తల్లిదండ్రులకు అమెరికాలో ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్లి స్థిరపడ్డారు. నటనపై ఆసక్తితో రిచా మళ్లీ ఇండియాకి వచ్చింది.
ప్రియా ఆనంద్లీడర్ చిత్రంలో నటించిన మరో బ్యూటీ ప్రియా ఆనంద్ కూడా ఎన్ఆరై. తమిళనాడుకు చెందిన ఆమె పై చదువులకోసం అమెరికాకు వెళ్లి సెటిల్ అయింది. నటనపై మక్కువతో మాతృభూమికి తిరిగి వచ్చి తమిళం చిత్రంలో నటించింది. ఆ తర్వాత లీడర్ లో ఛాన్స్ దక్కించుకుంది.
డైరక్టర్స్
శేఖర్ కమ్ములఎన్ ఆర్ ఐ అని చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేపేరు శేఖర్ కమ్ముల. న్యూ జెర్సీలో ఐటీ కెరీర్ ని వదులుకుని సినిమాల బాట పట్టారు. డాలర్ డ్రీమ్స్ తో ఎదురుదెబ్బ తిన్నప్పటికీ ఆనంద్ చిత్రం ద్వారా మంచి పేరు దక్కించుకున్నారు. మంచి కాఫీలాంటి చిత్రాలను తీస్తూ ముందుకు సాగుతున్నారు.
క్రిష్అద్భుత కథ చిత్రాలను తీసిన క్రిష్ చదువుకొవడానికి న్యూ జెర్సీ కి వెళ్లారు. అక్కడే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మిత్రుడు, ప్రస్తుత నిర్మాత రాజీవ్ రెడ్డి కలిసి కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. సినిమా గురించి ఆలోచనలు రావడంతో ఇండియాకి వచ్చి గమ్యాన్ని చేరుకున్నారు.
దేవా కట్టరొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వెన్నెల, ప్రస్థానం వంటి గొప్ప చిత్రాన్ని తీసిన దేవా కట్ట అమెరికా పౌరసత్వాన్ని అందుకున్నారు. ఇతను పుట్టింది కడప అయినప్పటికీ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సినిమా అనే పురుగు బుర్రలో తొలచడంతో ఫిల్మ్ నగర్ కి వచ్చారు.
శ్రీనివాస్ అవసరాలమెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ అవసరాల. ఇది అతని హోదా. ఉన్నత విద్యను నార్త్ డకోటా యూనివర్సిటీలో పూర్తిచేశారు. అమెరికాలోని పెద్ద కంపెనీలో కొన్నేళ్లు పనిచేశారు. ఇవి ఏమి అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. చిత్ర పరిశ్రమలోని 24 ఎందులోనైనా పట్టు సాధించాలని వచ్చారు. ఎక్కువ క్రాఫ్ట్ ల్లో నైపుణ్యం పొందారు.
ప్రవీణ్ సత్తారుచందమామకథలు .. అనే సినిమా టైటిల్ వినగానే దీన్ని ఎవరో అచ్చతెలుగు యువకుడు డైరక్ట్ చేసారని అంటారు. తీసింది వైజాక్ కి చెందిన కుర్రోడే, కానీ ఇతను శాప్ కన్సల్ట్రన్ట్ గా ఓ బడా కంపెనీలో పదేళ్ళపాటు పనిచేశారు. ఇష్టంతో సినీరంగంలో తేలారు. అతనే ప్రవీణ్ సత్తారు.
రాజ్ పిప్పళ్లభీమవరానికి చెందిన రాజ్ పిప్పళ్ల కంప్యూటర్ సైన్స్ లో ఎం టెక్ పూర్తిచేసి అమెరికాలో మంచి జాబ్ లో చేరారు. కొన్నేళ్లపాటు బాగా పనిచేశారు. చివరికి బోణీ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.