దర్శకధీరుడు రాజమౌళి ఆరోగ్యంపై ఆయన ఫ్యాన్స్ బెంగపెట్టుకున్నారు. ఆయన హెల్త్ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజుల క్రితం రాజమౌళి ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. తనకు తన కుటుంబానికి కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. హోమ్ కొరెంటైన్ అయిన రాజమౌళి ఇంటిలో ఉంటూ కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు కరోనా సోకినట్లు వెల్లడించి రెండు వారాలు అవుతున్నా మరో అప్డేట్ పంచుకోలేదు. రాజమౌళికి కరోనా తగ్గినదీ లేనిది అనే దానిపై ఎటువంటి అప్డేట్ లేకపోవడం కొందరిని టెన్షన్ కి గురిచేస్తుంది.
దానితో పాటు, ఆయన త్వరగా కోలుకొని వచ్చి ఆర్ ఆర్ ఆర్ పై ద్రుష్టి పెట్టాలని చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులు రాజమౌళి తన కెరీర్ లో ఎదుర్కొంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైన నాటి నుండి అన్నీ అవరోధాలే. పట్టుమని పదిరోజులు షూటింగ్ సవ్యంగా సాగలేదు. అన్నీ కుదిరాయి షూటింగ్ వాయువేగంతో పూర్తి చేసి ప్రకటించిన విధంగా జనవరి 8, 2021లో విడుదల చేయాలని భావించారు.
కరోనా వైరస్ రూపంలో అతిపెద్ద అవరోధం వచ్చి చేరింది. లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలలుగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. సెట్స్ తో నైనా షూటింగ్ పూర్తి చేయాలని భావించిన రాజమౌళి, అది కుదరక వెనక్కి తగ్గడం జరిగింది. దాదాపు 30శాతానికి పైగా షూటింగ్ మిగిలి ఉండగా, ఆర్ ఆర్ ఆర్ విడుదల సందిగ్ధంలో పడింది.