నందమూరి తారక రామారావు….తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని డిల్లీ నడివీదుల చెర నుంచి విడిపించి తెలుగు వాడి….వాడిని, వేడిని విశ్వ వ్యాప్తం చేసిన ఏకైక నటుడు….అయితే ఆయన మరణించి ఎన్నో ఏళ్లు గడిచినా…ప్రజల గుండెల్లో ఇంకా నిలిచే ఉన్నాడు….ఇదిలా ఉంటే తాజాగా నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా సినిమా తీస్తా దాని స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని ప్రకటించడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ జీవితంలో కీలకంగా మారి విమర్శల పాలైన లక్ష్మి పార్వతి….నాదెండ్ల నాదెండ్ల భాస్కరరావు అప్పుడే బాలయ్యపై విమర్శలు చేసేవారకూ వెళ్ళిపోయారు…..అయితే అదే క్రమంలో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది…ఏఏ విషయాలు సినిమాలో కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు అంటే….ఒక్క సారి ఈ స్టోరీ చదవండి…వివరాల్లోకి వెళితే…..ఎన్టీఆర్ జీవితం పై నిర్మించే ఈసినిమా నిమ్మకూరులో మొదలవుతుంది. నిమ్మకూరు నుండి చెన్నై వెళ్ళే వరకు ఎన్టీఆర్ జీవితంలో ఎదుర్కున్న ఎన్నో ఎత్తుపల్లాలతో పాటు చెన్నైలో టాప్ హీరోగా మారి ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఎదిగిన సందర్భాలను వివరంగా చూపెడతారట.
ఆతరువాత 1982 లో తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో అప్పటి రాజకీయ మహోన్నత శక్తి ఇందిరాగాంధీని ఓడించి అధికారంలోకి రావడంతో ఈసినిమాకు శుభం కార్డు పడేలా స్క్రిప్ట్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. దీనితో ఎన్టీఆర్ జీవితంలో వివాదాస్పద సంఘటనలకు చిరునామాగా మారిన లక్ష్మీపార్వతి – నాదెండ్ల భాస్కర రావుల ప్రస్తావన లేకుండా ఈసినిమాకు శుభం కార్డు పడేలా బాలయ్య ఆలోచిస్తున్నాడని సమాచారం….బహుశా అందుకేనేమో….బాలయ్య లక్ష్మీపార్వతి , నాదెండ్ల భాస్కరరావు మీడియా ముందుకు వచ్చి చేసిన విమర్శలకు సమాధానం చెబుతూ….”నా తండ్రి సినిమాను ఎక్కడ ప్రారంభించాలో మరెక్కడ ముగించాలో తనకు తెలుసు” అని కౌంటర్ ఇచ్చారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.