హిట్ డైరక్టర్, భారీ నిర్మాత, క్రేజీ కాంబినేషన్లు వీటిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి నమ్మకం పోయింది. అన్నింటి కన్నా కథే ముఖ్యమని భావిస్తున్నారు. అంతేకాకుండా వరుసగా ఒకే రకమైన కథలను చేస్తుంటే అవి ఎంత బాగున్నా బోర్ కొట్టేస్తాయని నిర్ణయానికి వచ్చారు. అందుకే వివిధ జానర్ లో కథలను ఎంచుకుంటూ విజయం సొంతం చేసుకుంటున్నారు.
మాస్ యాక్షన్ తో టెంపర్ తీసి హిట్ ట్రాక్ ఎక్కిన తారక్, తర్వాత క్లాస్ కథతో మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ ని తనవైపు తిప్పుకున్నారు. తర్వాత మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ స్టోరీతో జనతా గ్యారేజ్ చేసి హ్యాట్రిక్ ని అందుకున్నారు. ఈసారి ఈ మూడు జోనర్ లకు విభిన్నమయిన కథను ఎంచుకున్నారు. అదే కామెడీ. యంగ్ టైగర్ కామెడీ చేస్తే ఎలా ఉంటుందో అదుర్స్ చూస్తే తెలుస్తుంది. ఆయన టైమింగ్ కి థియేటర్స్ నవ్వులతో నిండిపోయింది. ఈ సారి అటువంటి కథ.. కాదు కాదు అదే స్టోరీ తో రానున్నారు.
అదుర్స్ కి సీక్వెల్ చేసి అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాను అదుర్స్ తెరకెక్కించిన వి.వి.వినాయక్ డైరక్ట్ చేయడానికి ఒకే చెప్పారు. గత ఏడాదే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయిందని, దానిని వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి పట్టాలెక్కించడానికి చూస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150 మూవీ పనులు జనవరి పూర్తి అయిపోతుంది. దాని తర్వాత మరో అదుర్స్ కోసం శ్రమించనున్నారు.