పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ ‘ఓజి’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఓజాస్ గంభీరగా పాత్ర పోషించారు.సెప్టెంబర్ 25న ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. అయితే ముందు రోజు అనగా సెప్టెంబర్ 24 నైట్ నుండే ప్రీమియర్ షోలు వేశారు. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటం,పాజిటివ్ టాక్ కూడా హెల్ప్ అవ్వడంతో మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘ఓజి’ చరిత్ర సృష్టించింది. అయితే 2వ రోజు కలెక్షన్స్ కొంచెం డౌన్ అయ్యాయి. ఓ పక్క భారీ వర్షాలు, మరోపక్క వీక్ డే కావడంతో 2వ రోజు కొంచెం కలెక్షన్స్ తక్కువగానే నమోదయ్యాయి. అయితే 3వ రోజు అనగా శనివారం నాడు గట్టిగా పుంజుకుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. 3వ రోజు కూడా కలెక్షన్స్ తక్కువగానే నమోదయ్యాయి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 28.8 cr |
సీడెడ్ | 13.28 cr |
ఉత్తరాంధ్ర | 8.58 cr |
ఈస్ట్ | 8.46 cr |
వెస్ట్ | 5.51 cr |
గుంటూరు | 7.69 cr |
కృష్ణా | 5.85 cr |
నెల్లూరు | 2.48 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 80.65 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 10.08 cr |
ఓవర్సీస్ | 26.38 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 117.11 (షేర్) |
‘ఓజి’ చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.117.11 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.185 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.56.89 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది.ఆదివారం గట్టిగా క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంది.