ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ సినిమా ఈ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు దాదాపు 3 ఏళ్ళ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టైంలో కూడా ‘ఓజి’ నినాదాలు ఎక్కువగా వినిపించాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ సైతం స్వయంగా ‘నాకు సినిమాలు చేసేంత టైం లేదు.
కానీ ‘ఓజి’ చూద్దురు గాని బాగుంటుంది’ అంటూ చెప్పడం జరిగింది. ఇక ఎన్నికల్లో గెలిచి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ‘ఓజి’ ఫీవర్ మరింత పెరిగింది అనే చెప్పాలి. మొత్తానికి మరో 3 రోజుల్లో ‘ఓజి’ రాబోతుంది. గ్లింప్స్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చాయి. సో కంటెంట్ ఓ మాదిరిగా ఉన్నా.. ‘ఓజి’ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో విజృంభించడం ఖాయంగా కనిపిస్తుంది.నిర్మాత దానయ్య ఆల్రెడీ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్నేహితులకు చూపించడం జరిగిందట.
వారి టాక్ ప్రకారం.. ‘ఓజి’ సినిమా కథ 1980 బ్యాక్ డ్రాప్లో సాగుతుందట. ఇందులో పవన్ కళ్యాణ్ ఓజి అలియాస్ ఓజాస్ గంభీర అనే ఒక మాస్టర్ గా కనిపిస్తారట. ఊహించని కారణాల వల్ల అతను ముంబైకి దూరంగా కలకత్తాలో నివసిస్తూ ఉంటారని అంటున్నారు. మరోవైపు ముంబై బ్యాక్ డ్రాప్లో కొన్ని సన్నివేశాలు వస్తాయట. సత్య దాదా కుటుంబానికి ఓజికి ఉన్న సంబంధం ఏంటి?
ఓజి ఎందుకు ముంబైకి దూరమయ్యాడు? ఓమి(ఇమ్రాన్ హష్మి) ఎందుకు ‘ఓజి’ ని చంపాలని ఎందుకు పగబట్టి తిరుగుతాడు? అనేది మిగిలిన కథ అని అంటున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రో అదిరిపోయిందట. ప్రతి 10 నిమిషాలకు ఒక హై మూమెంట్ వస్తుందట. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా 3 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయట. అవి సినిమాకే హైలెట్ అని.. వాటికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ అని అంటున్నారు. చూడాలి మరి ప్రీమియర్ షోలతో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..!