పాత సినిమాలకు సంబంధించిన ప్రింట్లను 4K వెర్షన్ కు డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ మహేష్ బాబు ‘పోకిరి’ మూవీతో మొదలైంది. ఆ సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయ్యింది. తక్కువ షోలు పడినప్పటికీ ఆ సినిమాకి రీ రిలీజ్ లో కూడా మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. అటు తర్వాత పవన్ కళ్యాణ్ ‘జల్సా’ చిత్రం కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా ‘పోకిరి’ రీ రిలీజ్ లో సాధించిన కలెక్షన్లను అధిగమించింది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా కూడా గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యింది. అనూహ్యంగా ఈ చిత్రం ‘జల్సా’ కలెక్షన్లను అధిగమించి రీ రిలీజ్ సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన మూవీగా తిరుగులేని రికార్డుని సొంతం చేసుకుంది. ఇక రేపు అనగా జనవరి 7న మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’ మూవీ రీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి.
కానీ డే1 అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘ఖుషి’ కంటే వెనుకబడి ఉంది ‘ఒక్కడు’ మూవీ. ‘ఖుషి’ చిత్రం డిసెంబర్ 31న రీ రిలీజ్ అవ్వడానికి ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్ 30న రూ.1.80 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. అయితే ‘ఒక్కడు’ చిత్రానికి కేవలం రూ.1.05 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. ‘ఖుషి’ ‘ఒక్కడు’ రెండు ఆల్ టైం హిట్ మూవీస్ అనే చెప్పాలి. అయితే ‘ఖుషి’ రీ రిలీజ్ కు నిర్మాత ఎ.ఎం.రత్నం,దర్శకుడు ఎస్.జె.సూర్య వంటి వారు ప్రమోట్ చేశారు.
కానీ ‘ఒక్కడు’ విషయంలో మేకర్స్ అలాంటి స్టెప్ తీసుకోలేదు. ట్రైలర్ రిలీజ్ చేసి సరిపెట్టుకున్నారు అంతే..! అందులోనూ వచ్చే వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో ‘ఒక్కడు’ రీ రిలీజ్ ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు అనే చెప్పాలి.